ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టైలిష్ విలన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ విలన్ గా ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ నటుడు పేరు అశుతోష్ రానా. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన వెంకీ సినిమాలో డీజీపీ పాత్రలో టెర్రపిక్ నటనతో మెప్పించిన అశుతోష్.. కేవలం పవర్ఫుల్ విలన్ గానే కాదు, తను నటనతో కామెడీ సైతం పండించి ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు. తెలుగులో వెంకీ తర్వాత అదే రేంజ్ లో గుర్తింపు తెచ్చిన మూవీ బంగారం. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. భూమారెడ్డి పాత్రలో తన నటనతో మెప్పించాడు.
ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న.. అశుతోష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ.. అతి తక్కువ టైంలోనే బిజీబిజీగా మారిపోయాడు ఆశుతోష్. అలా.. టాలీవుడ్‌లో ఇప్పటికే ఒక్కమగాడు, విక్టరీ, బలుపు, తడాకా, పటాస్ ఇలా.. వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కాగా బాలీవుడ్‌లోను పలు సినిమాలతో నటించి మెప్పించాడు. తమిళ్, కన్నడ, మరాఠీ భాషల్లోనూ రాణిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పక్కన నటుడుగా బిజీగా గడుపుతూనే.. మరో పక్క ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే అశుతోష్ కుటుంబం గురించి చాలామందికి తెలియదు.
ఈయన భార్య కూడా టాలీవుడ్ లో తోపు హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తన పేరే రేణుక శహాన్. 1998లో హిందీలో తెరకెక్కిన తమచా మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత హిందీలో పలు సినిమాల్లో కీలక పాత్రలో మెరిసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో.. జెడి చక్రవర్తి హీరోగా నటించిన మనీ.. మనీ.. సినిమాలో ఈమె హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది రేణుక. తర్వాత తెలుగులో ఈమె మరో సినిమా చేయకపోవడం అందరికీ షాక్‌ను కలిగించింది. అయినా తెలుగులో ఆ ఒక్క సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.