దివంగత అతిలోక సుందరి శ్రీదేవికి తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. బాత్ టబ్‌లో మునిగి చనిపోయినట్లుగా దుబాయ్ పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన.. ఈమె మరణం పై ఎంతో మందికి ఇంకా సందేహాలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా బోనికపూర్.. శ్రీదేవి పేరుపై ఉన్న రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆమెను చంపేసాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీదేవి మరణంలో.. బోని కపూర్ పై చాలా అనుమానాలు రేకెత్తాయి. ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది బోనీకపూర్ ను అనుమానిస్తూ వచ్చారు.
అయితే బోనికప్పుర్ మాత్రం.. ఇందులో నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. శ్రీదేవి కఠినమైన డైట్ పాటించడం వల్ల అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేదట. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా డైట్ చేయడంతో చివరకు బాట్ టాబ్లో స్నానం చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయి.. నీళ్లలో మునిగి చనిపోయిందంటూ పోలీసులు వివరించారు. అయితే శ్రీదేవి డెత్ మిస్టరీకి.. ఓ నెంబర్‌కు సంబంధం ఉందంటూ.. న్యూమరాలజీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. అదేంటంటే శ్రీదేవి మరణానికి నంబర్ 4కి మధ్య ఓ లింకు ఉందట. శ్రీదేవి ఆగస్టు 13, 1963 లో జన్మించింది.
కాగా న్యూమరాలజీ ప్రకారం 13, 4, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి మూలంకనం నాలుగు కావడంతో ఈ తేదిలో పుట్టిన వారికి రాహువు అధిపతిగా ఉంటారట. ఇక న్యూమరాలజీ ప్రకారం.. వారు అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. రహస్య మరణంతో పాటు.. ఎన్నో అనుకొని సంఘటనలు జరుగుతాయని మూలంకం 4 ఉన్నవారు జీవితంలో అత్యున్నత స్థానాలను అందుకొని.. వాళ్లు అందరిలోనూ హైలైట్ గా మారతారని.. వారి లక్ష్యాలు చేదించడంలో ముందుంటారని తెలుస్తుంది. అయితే వీరు చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. వాళ్ళ మనసులో ఏముందో అసలు బయటపడరు. మూలంకరణ 4 ఉన్న వ్యక్తులు అనుకొని సంఘటన జరిగిన కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలతో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాదు.. వీళ్ళ చావు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా, వింతగా ఉంటుందట. అందుకే న్యూమరాలజీ ప్రకారం శ్రీదేవి చావు కూడా వింతగా వచ్చిందని తెలుస్తుంది.