మంచు విష్ణు సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో.. డ్రీం ప్రాజెక్టుగా రూపొందించిన మైథాలజికల్ మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తాజాగా ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప.. చరిత్ర స్ఫూర్తితో మైథాలజికల్ డ్రామాగా కన్నప్ప రూపొందింది. ఇక సినిమాలో మంచి విష్ణు టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు. అంతేకాదు ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి స్టార్ సెలబ్రిటీస్ అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో మెరవనున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఒక్కొక్కటిగా ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది రివీల్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్, హీరో ఫస్ట్ లుక్ ఇలా సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఇక టీజర్.. అధ్యంతం బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ వండర్స్‌తో ఆకట్టుకుంటుంది. 100 మందిని చంపిన తిన్నడిగా మంచు విష్ణు తన యాక్షన్ అవతార్ చూపించాడు. ఇక ప్రభాస్, కాజల్, మోహన్ బాబులను కూడా క్షణం పాటు చూపించారు. ఇక టీజర్ చివరిలో.. శివయ్య అంటూ మంచు విష్ణు గట్టిగా పిలిచిన తర్వాత అక్షయ్ కుమార్ ను చూపించారు.
మొదటి నుంచి ప్రమోషన్స్ లో భాగంగా విజువల్ వండర్‌ను మీరు ఈ సినిమాలో చూడబోతున్నారంటూ మేకర్స్ వివరిస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్‌లో అదే మాదిరి ఉత్కంఠ భరతమైన విజువల్స్, స్టోరీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మెప్పించాయి. చూస్తుంటే కెన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప ఆకట్టుకోవడం ఖాయం అనేలా ఉంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్‌లో డైలాగ్స్ తో పాటు.. యాక్షన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక మంచు విష్ణు.. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికి ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. 2025 ఏప్రిల్ 25న థియేటర్లో రానున్న ఈ సినిమా ఆడియన్స్‌కు ఇతిహాస గాధగా.. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందన ఫీల్ టీజర్ చూస్తే కలుగుతుంది.