బ‌న్నీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..!

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్‌ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాడు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా నటించబోతున్నాడంటూ టాక్‌ నడుస్తుంది. అయితే మరోపక్క కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఉండనుంద‌ని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన రాలేదు.

ఇక ప్రస్తుతం ఫారెన్ లో రిలాక్స్ అవుతున్న అల్లు అర్జున్.. గత రెండు మూడేళ్లలో ఎదుర్కొన్న మానసిక, శారీరిక వ‌త్తిడికి పూర్తిస్థాయి ఉపశమనం పొందాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే.. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన బన్నీ లుక్ టెస్ట్ ఇటీవల పూర్తయిందని.. ఉగాది నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలో మూవీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు.

Naga vamsi: Producer Naga Vamsi Faces Backlash Over 'Sleepless' Comments

ఆయన నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ 2.. మార్చ్ 29న గ్రాండ్గా రిలీజ్ కానుంది. సినిమా సంబంధించిన ప్రెస్ మీట్‌ను తాజాగా ఏర్పాటు చేసిన వంశీ.. ఈ ప్రెస్‌మీట్‌లో విలేకరి.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా వచ్చే నెల ప్రారంభమవుతుందా అని అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు. ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదని.. ఏది జరిగినా వచ్చే ఏడాది ద్వితీయ అర్థం లోనే ఉంటుందంటూ వివరించాడు. దీంతో ఉగాది నుంచి సినిమా ప్రారంభమవుతుందంటూ ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురయింది.