ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో పాన్ ఇండియా లెవెల్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సలార్, కల్కి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం ది రాజసాబ్ సినిమా షూట్ లో బిజీగా గగడుతున్నాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్, ఫౌజి, సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. అంతేకాదు.. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రభాస్ మూడు సినిమాల్లో నటించనునట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఇందులోనే సలార్ 2 ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది.
ఇది కాకుండా ప్రభాస్ తో వీలైనంత వేగంగా హోంబలే సంస్థ మరో సినిమాను నిర్మించనుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ బ్రహ్మరాక్షస లో ప్రభాస్ నటించనున్నాడని సమాచారం. మొదట ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ రన్వీర్ సింగ్ ను అనుకున్నా.. ఏవో కారణాలతో అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో.. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ తో ఈ అత్యంత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాని రూపొందించాలని అనుకుంటున్నాడట.
అంతేకాదు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై మూడో సినిమాగా ప్రభాస్ – లోకేష్ కనగరాజ్ సినిమాను రూపొందించనున్నారని టాక్. ఈ వార్తల వాస్తవం ఎంత తెలియదు కానీ.. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ముగ్గురు దర్శకులు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ సెలబ్రిటీగా దూసుకుపోతున్న వారే కావడంతో.. వీళ్ళ ముగ్గురు గట్టిగా ప్లాన్ చేస్తే.. ఒక్కో సినిమాకు రూ.2 వేల కోట్లు వసూలు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అంతకుమించి వసూళతో కుంభస్థలం బద్ధలు కొట్టినా సందేహం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.