ప్రభాస్ సరసన ఆ ఫ్లాప్ హీరోయిన్.. జాక్పాట్ కొట్టిందిగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాదిలో రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ ప్లాన్ చేసుకుంటటున్నాడు. ఇక‌ ప్రభాస్ క్రేజ్ రిత్య ఆయ‌న సరసన నటించే ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని ఎంతమంది స్టార్ హీరోయిన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ తన సినిమా కోసం ఓ ప్లాప్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్స్‌. ఇక భాగ్య శ్రీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సరైన హిట్‌ కూడా లేదు.

Prabhas Set to Embrace Dark Role in Prashanth Varma's Cinematic Universe? |  Prabhas Set to Embrace Dark Role in Prashanth Varma's Cinematic Universe?

ఇలాంటి క్రమంలో ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం భాగ్యశ్రీ.. రామ్ పోతినేని సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అతనితో ప్రేమలో ఉందంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అమ్మడు ప్ర‌భాస్‌తో క్రేజీ ప్రాజెక్టుకు సెలెక్ట్ అయిందట‌. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూట్లో బిజీగా ఉన్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన వెంటనే.. ప్రశాంత్ వ‌ర్మా డైరెక్షన్‌లో బ్రహ్మ రాక్షస సినిమాకు ప్రభాస్ సైన్‌ చేశాడని సమాచారం.

Bhagyashri Borse - IMDb

ఇక ప్రభాస్ – హ‌నురాగపూడి కాంబోకు ఇమన్వి అనే కొత్త అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో బ్రహ్మరాక్షసుడు సినిమా కోసం భాగ్యశ్రీ బోర్సేతో ఆడిపడడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. భాగ్యశ్రీ కూడా ప్రభాస్ తో కలిసి టెస్ట్ షూట్లో పాల్గొంద‌ని సమాచారం. ప్రభాస్‌తో సినిమా అంటే.. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ పక్కా. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు వస్తాయి. దీంతో అక్కడ ఇండస్ట్రీలో ఆమెకు మరింత ప్లస్ అవుతుంది అని.. అమ్మ‌డి కెరీర్‌కు బ్రహ్మరాక్షస మూవీ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని.. ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాను ప్రభాస్ సైడ్ చేసి.. ప్రశాంత్ వర్మ సినిమాను లైన్లో పెట్టడం అందరికి షాక్‌ నిస్తుంది. బ్రహ్మరాక్షస్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉండనుంద‌ని.. అయితే కథ నచ్చ‌డంతో సలార్ 2, కల్కి 2 కంటే ముందే ఈ సినిమాను చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.