అప్పుడు బన్నీ.. ఇప్పుడు రాజమౌళి.. ఆ తప్పే వాళ్ళ పాలిట శాపం అవుతుందా..?

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి నేషనల్ లెవెల్‌లో స్టార్ట్ డైరెక్టర్గా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరోకి మించిపోయే రేంజ్‌లో జక్కన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అలాంటి రాజమౌళి.. ఇటీవల వివాదాన్ని ఎదుర్కుంటున్నాడు. రాజమౌళి కారణంగా నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నానని.. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని.. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్న అంటూ అతని స్నేహితుడు కే.శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. గ‌తంలో రాజమౌళి, తాను ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించమని.. రాజమౌళి కోసం అమ్మాయిని కూడా త్యాగం చేసి సింగల్ గా ఉంటున్నా.. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు బయటపెడతాను అనే ఉద్దేశంతో రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

SS Rajamouli | ఆ అమ్మాయి వ‌ల‌నే నేను రాజ‌మౌళి విడిపోయాం : య‌మ‌దొంగ  ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. వీడియో-Namasthe Telangana

దీంతో రాజమౌళి పై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అంతే కాదు ఈ వీడియో పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి తో పాటు తన భార్య రమా రాజమౌలిపై కూడా ఇంతలా ఆరోపణలు చేసిన ఇప్పటివరకు జక్కన్న కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ రియాక్ట్ కాకపోవడంతో గతంలో ఓ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన తప్పును.. ఇప్పుడు రాజమౌళి కూడా చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో బన్నీ తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి మరి ఓ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే సొంత పార్టీని అవాయిడ్ చేసి ఆపోజిట్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడంటూ అల్లు అర్జున్‌ రకరకాలుగా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇప్పటికి ఆయనపై ఎన్నో నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే అలా వార్తలు వినిపించిన ప్రారంభంలోనే.. అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి.. ఇది కేవలం ఫ్రెండ్షిప్ అని చెప్పి ఉంటే.. ఇంతలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు రాజమౌళి కూడా పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఈ విషయం గురించి మౌనంగా ఉండడంతో.. తన కెరీర్ లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని.. ఇదే విషయం మరింత ల్యాగ్‌ అయితే.. రాజమౌళి స్టార్డం దెబ్బ తినడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఘటనపై రాజమౌళి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.