సమంత స్టామినా చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ద‌శాబ్ధ‌కాలం పాటు టాలీవుడ్‌ను ఊలేసింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పటికి సమంత టాలీవుడ్ సినిమాలు నటించి రెండేళ్లు గడుస్తున్నా.. అమ్మడి క్రేజ్‌.. తెలుగు ఆడియన్స్‌లో ఏమాత్రం తగ్గలేదు. ఈ క్ర‌మంలోనే స‌మంతా ఏ పోస్ట్ షేర్ చేసుకున్న.. ఏ చిన్న అప్డేట్ ఇచ్చిన క్షణాల్లో అది వైరల్ గా మారుతుంది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత.. మయాసైటిస్ బారిన పడిన సమంత చాలా కాలం సినిమాలకు దూరమైంది. ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్‌తో మంచి సక్సెస్ అందుకుంది.

110 கிலோ எடையை அசால்டாக தூக்கிய நடிகை சமந்தா.. வைரலாகும் வீடியோ

దీంతో.. ఇప్పుడు ఇప్పుడే వరుస‌ సినిమాలను లైన్లో పెడుతూ మళ్లీ బిజీ హీరోయిన్గా మారే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సమంతకు బాడీ ఎక్స‌ర్సైజ్‌లు, మెడిటేషన్ లాంటివి మొదటి నుంచే చాలా ఇంట్రెస్ట్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే.. అమ్మడు పలు సందర్భాల్లో తను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటుంది. అలా.. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఈసారి సమంత తన ఫిట్నెస్ చూపిస్తూ షేర్ చేసిన విడియో ఫ్యాన్స్‌కు షాక్‌ను కలిగించింది.

Samantha Ruth Prabhu Lifts 110 Kg In Gym Like A Pro, Says 'Go Big Or Go  Home' - News18

ఏకంగా 110 కేజీల బరువున్న డంబెల్‌ ఎత్తి.. తన స్టామినా ఏంటో నిరూపించుకుంది. ఇక మాయోసైటీస్ తో సతమతమవుతున్న సమయంలో కూడా సమంత జిమ్ చేస్తూ ఉండేది. తన లైఫ్లో లో ఫిట్నెస్ ను ఒక భాగంగా మార్చేసుకున్న సమంత.. హెల్ది ఫుడ్, బాడీకి సరైన ఎక్ససైజ్ అందిస్తూ మైనాసైటిస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంది. అయితే.. తాజాగా షేర్ చేసిన వీడియోతో సమంత ఫిట్నెస్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తుందో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. బక్క చిక్కిపోయి వీక్ గా తయారైందనుకున్నా సమంతలో ఇప్పటికి అంత స్టామినా ఉందా అంటూ.. ఏకంగా 110 కేజీల డంబెల్‌ను అలా ఎలా ఎత్తేసావు సామ్ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.