తెలుగు సినిమా రీమేక్ చేసి రూ.350 కోట్లు కొల్లగొట్టిన హీరో.. మూవీ ఏంటంటే..?

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా, కథ మొత్తం ముందే తెలిసిన బోర్ కొట్టవు. ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది. అలాంటి ఓ సౌత్ సినిమాను హిందీలో రీమేక్ చేసి ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టారు. వరుస ప్లాపులతో ఉన్న అనటుడికి సమయానికి ఈ పినిమా సూపర్ హిట్ ఇచ్చి మళ్లీ స్టార్ స్టేటస్ ను సంపాదించి పెట్టింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం. అదే 2017లో తెలుగులో వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా.. ఇక్కడ యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. టీనేజర్లలో ఇంత పీక్స్ లవ్ ఉంటుందా అనేలా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ARJUN REDDY (Telugu) – 707Error Films

ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రెండోసారి తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే తెలుగులో హిట్ అయిన అర్జున్ రెడ్డి చాలామంది తెలుగులో చూసినా కూడా.. మళ్లీ హిందీ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపారు. మంచి కథ, మ్యూజిక్ ఉండడంతో సినిమా ఎలా ఉంటుందో బాలీవుడ్ వర్షన్ లో చూడాలని ఆరాటపడ్డారు. అర్జిత్ సింగ్ పాడిన ఈ సాంగ్స్ మూవీకి మ‌రింత హైలెట్ గా నిలిచాయి. ఇక తెలుగులో షాలిని పాండే హీరోయిన్గా నటించగా.. హిందీ వర్షన్ కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ మెరిసారు.

Kabir Singh - Wikipedia

షాహిద్ కపూర్ బాలీవుడ్ లో మంచి స్టార్ అయినప్పటికీ.. పద్మావత్ తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురు కావటంతో.. ఫెడ్ అవుట్ దశ‌కు చేరుకున్నాడు. ఇలాంటి క్రమంలో వచ్చిన కబీర్ సింగ్ ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ కావడం.. ఆయన కెరీర్‌కి హైలైట్‌గా నిలిచింది. 2 గంటల 52 నిమిషాల న‌డివితో తెర‌కెక్కిన ఈ సినిమా.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే పలు విమర్శలు ఎదురైనా.. రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. రూ.60 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.379 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.