రాజమౌళి, త్రివిక్రమ్ కాదు.. పూరి పాత రోజులు గుర్తు చేసుకో.. కోదండరామిరెడ్డి వార్నింగ్

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి యంగ్‌ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి టాప్ డైరెక్టర్గా ఎలాంటి స్టేజ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ కూడా తనదైన స్టైల్ లో రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ బాగా వెనక పడిపోతున్నారు. అలాంటి వారిలో పూరి జగన్నాధ్‌ ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు వరుస‌ బ్లాక్ బస్టర్లు అందుకున్న పూరి.. పోకిరి లాంటి ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను సైతం మంచినీళ్లు తాగినంత సులభంగా తెర‌కెక్కించాడు.

A. Kodandarami Reddy - Wikipedia

వరుస పెట్టి సూపర్ హిట్‌లు అందుకున్నడు. అతి తక్కువ సమయంలోనే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా పూర్తి చేసి సక్సెస్ అందుకోగల స్టామినా పూరి సొంతం. అయితే ఇటీవల కాలంలో ఆయ‌న సక్సెస్ పక్కకు తప్పుకుంది. ఈ క్రమంలోని చివరి రెండు సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూట కట్టుకున్నాడు పూరి. అయితే తాజాగా సీనియర్ స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి.. ప్రస్తుతం ఉన్న దర్శకుల గురించి మాట్లాడుతూ యంగ్ డైరెక్టర్ సైతం చాలా చక్కగా సినిమాలు తెరకెక్కిస్తున్నారని.. ఇక రాజమౌళి గురించి ప్రపంచం అంత మాట్లాడుకుంటుంది.. ప్రత్యేకంగా ఆయన ప్రతిభ గురించి చెప్పాల్సిన అవసరం లేదంటూ వివరించాడు.

Puri Jagannadh Latest Podcast Is About How One Should Lead A Life

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నాకు మొదటి నుంచి మంచి ప‌రిచ‌యం ఉంది. నా ఫేవరెట్ డైరెక్టర్ కూడా. పంచ్ డైలాగ్స్ చాలా చక్కగా రాస్తాడంటూ వివరించాడు. పూరి జగన్నాథ్ చాలా తెలివైన డైరెక్టర్.. చాలా మంచి సబ్జెక్టుని ఎంచుకొని వేగంగా సినిమాలు చేయగలడు. ఒకప్పుడు ఎంతో చక్కని సినిమాలను తీశాడు. కానీ.. ప్రస్తుతం ట్రాక్ తప్పాడు. ఈ క్రమంలోనే తాజాగా పూరిని ఓ ఫంక్షన్ లో కలిశా. సరదాగా ఊరికి వార్నింగ్ కూడా ఇచ్చా. నువ్వు బ్రహ్మాండమైన డైరెక్టర్‌వి.. మల్లి ఓసారి పాతరోజులు గుర్తు చేసుకోవయ్యా అని వార్నింగ్ ఇచ్చానంటూ కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చాడు.