సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో.. ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉంటారు.. ఎప్పటికీ చెప్పలేము. ఇలాంటి క్రమంలోనే సినిమాల్లో వృత్తిపర లైఫ్ కన్నా, పర్సనల్ విషయాల్లో చోటుచేసుకున్న కాంట్రవర్సీలతోనే హైలైట్ అవుతూ ఉంటారు చాలా మంది సెలబ్స్. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. నటి మనిషా కొయిరాలా. గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నఈ ముద్దుగుమ్మ.. 53 సంవత్సరాల వయసులో కూడా ట్రూ లవ్ కోసం వేచి చూస్తోంది.
కదా ఇప్పటివరకు మనీషా కోయిరాలకు ఏకంగా 12 మంది సెలబ్రిటీలతో ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు వినిపించాయి. పెళ్లయిన రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నానని రూమర్స్ వినిపించిన తర్వాత కూడా.. నేను తప్పుడు వ్యక్తులను నమ్ముతూనే వచ్చా.. నా లైఫ్ లో ఒక్క మ్యాన్ కూడా ట్రూ లవ్ ఇవ్వలేదు ఎప్పుడూ నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటా. నాలో ఏదో లోపం ఉంది. నేను తప్పు వ్యక్తుల వైపు మాత్రమే అట్రాక్ట్ అవుతా.. నన్ను బాధ పెడుతున్న విషయాల గురించి నేను ప్రశాంతంగా ఆలోచించా.. గత ఐదారు సంవత్సరాలుగా ఒంటరిగానే ఉంటున్నా అంటూ వివరించింది.
నాకు మంచి బాండ్ కావాలి. మేమిద్దరం ఒకరినొకరు అంగీకరిస్తామని నమ్మకం కలగాలి. మేము ఒకరితో ఒకరు నిజాయితీగా ఉంటాము.. ముందుకు సాగడానికి ఏం నేర్చుకోవాలి అనేది అర్థం చేసుకోవడం ముఖ్యం. మా ప్రయాణంలో ఒకరికొకరు మద్దతుగా ఇవ్వగలమా లేదా.. అనేది చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి పార్ట్నర్ కోసం తాను వెతుకుతున్నానని వివరించింది. ఇక మనిషా కొయిరాలకు మొదటి నానా పట్టేకర్‌తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. వెంటనే.. అతనికి వేరొకరితో వివాహం జరగడంతో ఆ వార్తలకు చెక్ పడింది. తర్వాత మనిషా పేరు వివేక్ ముష్రాన్, డీజే హుస్సేన్, సెసిల్ ఆంటోనీ, ఆర్యన్ వేద్, ప్రశాంత్ చౌదరి, తారీక్ ఫ్రేమ్జీ, రాజీవ్ ముల్చందాని, క్రిప్టోఫర్ డోరీస్ లతో ఎఫైర్ నడిపిందంటూ ఎన్నో వార్తలు వినిపించాయి.