టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీనుంచి సీనియర్స్ స్టార్ హీరోగా నాగార్జున రాణిస్తున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ లుక్, |ఫిట్‌నెస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాగార్జున.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోలకు కూడా లేని టాలెంట్ నాగార్జునకు సొంతం. అదే రొమాంటిక్ యాంగిల్. ఈ క్రమంలోనే తన సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని టాలీవుడ్ మన్మధుడిగా మారిపోయారు.
ఇదిలా ఉంటే ఆయన నుంచి గత కొంతకాలంగా సోలో సినిమా వచ్చిందే లేదు.. కోలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్న నాగార్జున.. ఇప్పటికే తన 99 సినిమాలను పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే తన 100వ సినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తాడా అంటూ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే.. తాజాగా నాగర్జున 100వ సినిమాకు సైన్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగ్. ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించబోతుందని సమాచారం. ఇప్పటికే త్రిష మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగార్జున 100వ సినిమాకు మెగా బ్యూటీ నటించబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిషతో పాటు.. ఈ సినిమాలో మరో సీనియర్స్ స్టార్ బ్యూటీ కూడా మెరవనుందట. ఆమె మీనా. ఇక నాగార్జున – మీనా కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అన్న సంగతి తెలిసిందే. ఎవర్ గ్రీన్ పేయిర్‌గా ఉన్న ఈ జంట మళ్ళీ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత నాగార్జున వందో సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నిజంగా మీన, నాగార్జున, త్రిష కాంబోలో ఆయన వందో సినిమా తెరకెక్కితే మాత్రం.. నాగార్జున తన ఖాతాలో బ్లాక్ బాస్టర్ వేసుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.