మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా విష్ణు కన్నప్ప ప్రాజెక్టును అనౌన్స్ చేసి సెట్స్‌పైకి తీసుకోచ్చిన అప్పటినుంచి.. పాజిటివ్ కంటే ఎక్కువగా నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ కనిపించాయి. ముఖ్యంగా విష్ణు పై ఎప్పటికప్పుడు ట్రోల్స్ చేస్తూ తెగ ఆడేసుకుంటున్నారు ఆకతాయిలు. అంతేకాదు.. కన్నప్ప నుంచి ఏ చిన్న లీక్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో పాజిటివ్ కన్న నెగెటివిటీనే ఎక్కువగా కనిపించింది. అయితే ఏప్రిల్ 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెకండ్ టీజర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అయితే ఇప్పటివరకు వచ్చిన నెగెటివిటీ అంతా కొట్టి పడేస్తూ.. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ మొత్తం ఒక లెక్క అయితే.. లాస్ట్ మూడు సెకన్‌ల్లో ప్రభాస్‌ను ఎలివేట్ చేసిన సీన్ మరో లెక్క. ఈ క్రమంలోనే కేవలం ప్రభాస్ లుక్ చూసిన తర్వాత.. కచ్చితంగా ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కు వస్తామంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి పెట్టిన ఓ షాకింగ్ కండిషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ నుంచి ఒక్కరోజు కాల్ షీట్లు దొరకడమే చాలా కష్టం.
అయితే మోహన్ బాబు పై ఉన్న రెస్పెక్ట్ తో ప్రభాస్.. కన్నప్పలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా పని చేశాడు. అయితే ఈ సినిమా కోస్ ప్రభాస్ పెట్టిన ఏకైక కండిషన్ ఏంటంటే.. తను కేవలం ఏడు రోజుల కాల్ షీట్ మాత్రమే ఇస్తానని.. ఈ ఏడు రోజుల్లోనే తనకు సంబంధించిన సీన్స్ అన్ని తెరకెక్కించాలని మాట్లాడుకున్నాడట. దానికి కారణం ప్రభాస్ తన మిగతా పాన్ ఇండియా సినిమా షూట్లలో బిజీగా ఉండడమే. కాగా ప్రభాస్ మహా తెలివైనవాడు అంటూ ముందే ఇలా కంవడీషన్ పెట్టుండక పోతే.. మరిని కాల్ షీట్లు కన్నప్ప టీం మింగేసేవారు అంటూ.. అయినా సినిమాల విషయంలో చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడంటూ.. అది ప్రభాస్ మాస్టర్ మైండ్ అంటూ.. ప్రభాస్ తెలివికి నోరెళ్ళబెడుతున్నారు. ప్రశంసల కురిపిస్తున్నారు ఫ్యాన్స్.