టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంట్లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇటీవల తన పెద్ద కొడుకు నాగార్జున వివాహాన్ని గ్రాండ్గా చేసిన నాగ్ త్వరలోనే తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి కూడా చేయనున్నాడట. అయితే తాజాగా ఈ పెళ్లికి కూడా సన్నధాలు చేస్తున్నట్లు సమాచారం. వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు సర్వే గంగా చేస్తున్ అక్కినేని ఫ్యామిలీ.. త్వరలోనే అఫీషియల్ గా పెళ్లి డేట్ ను వెల్లడించనున్నారని సన్నిహితుల చెబుతున్నారు.
ఇంతకీ అఖిల్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ నెలలో వారి సొంత స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరి పెళ్లి తర్వాత శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలను ఈ జంట సందర్శించుకుని వచ్చారు. ఇక ఆ పెళ్లి సందడి ముగిసింది అనుకునే సమయానికి.. మరోసారి పెళ్లి సందడికి ఫ్యామిలీ సిద్ధమవుతున్నారు. నాగార్జున, అమలాల ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని తాజాగా తన లవ్ ఎఫైర్‌ను రివీల్ చేసి ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించాడు.
ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావిడ్జ్ కూతురు.. జైనాబ్ రావిడ్జ్ తో తన ప్రేమను రివిల్ చేశాడు. చాలా కాలం పాటు తన లవ్‌ను సీక్రెట్ గా మెయింటైన్ చేసిన అఖిల్.. జైనబ్‌ల నిశ్చితార్థ వేడుక.. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా జరిగింది. నవంబర్ 27, 2024న ఎంగేజ్మెంట్ ప్రైవేట్ గా చేసుకున్నారు. అదే సమయంలో వీళ్ళ పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబాలు మార్చి నెలలో వివాహానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పుడు చురుగ్గా సాగుతున్నాయని. వెడ్డింగ్ డెస్టినేషన్ ఇంకా క్లారిటీ లేకపోవడంతో.. వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అఖిల్ వివాహాన్ని మాక్సిమం రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా చేయనున్నారట.