టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమై మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన సందీప్.. ఇదే సినిమాను తర్వాత హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి మరోసారి అక్కడ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే చివరగా యానిమల్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాడు. అలా.. ఇప్పటివరకు సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కింది అతి తక్కువ సినిమాలైనా.. ప్రతి సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక టాలీవుడ్‌ను రాంగోపాల్ వర్మ తర్వాత.. ఓ వైవిధ్యమైన కోణంలో చూపించిన దర్శకుడు ఎవరంటే.. సందీప్ రెడ్డి వంగ పేరే వినిపిస్తుంది.
ఇక సందీప్.. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్‌ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా.. లేదా.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో ఒక దేశభక్తి కాన్సెప్ట్ ఉన్న సినిమాను తీయాలని సందీప్ రెడ్డివంగా ఫిక్స్ అయ్యాడట. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. సందీప్ రెడ్డివంగ తన సినిమాల్లో బోల్డ్ నెస్ ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి క్రమంలో సందీప్ రెడ్డి వంగ నుంచి దేశభక్తి సినిమా అంటే ఆయన ఎలా తెరకెక్కిస్తారో.. ఆ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో.. అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పూర్తిగా సినిమా కోసం తన డైరెక్షన్ స్టైల్ మార్చుకొని డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇప్పటికే సినిమా లైన్ ని అల్లు అర్జున్‌కు వినిపించడం.. ఆయన చాలా ఎక్సైట్ అయి పూర్తి కథను రాసుకొని రమ్మన్నాడని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సందీప్ రెడ్డి డైరెక్టర్గా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తనువైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే ఇండియన్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లిస్టులో సందీప్ రెడ్డివంగా పేరు చేరిపోయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ రాబోయే సినిమాలతోనూ ఇదే రెంజ్ సక్సెస్‌లు అందుకని నంబర్ వన్ డైరెక్టర్గా మారతాడు.. లేదా.. వేచి చూడాలి.