టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చివరిగా తెరకెక్కించిన మూవీ యానిమల్‌తో ఎలాంటి సంచలనం సృష్టించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణ్‌బీర్ సింగ్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా ఏ రేంజ్ లో హైలైట్ అయిందో.. అదే రేంజ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అనిమల్ సినిమాను ఉద్దేశిస్తూ ఓ మాజీ ఐపీఎస్ అధికారి చేసిన నెగిటివ్ కామెంట్స్ పై ఆయన రియాక్ట్ అయ్యాడు.
సందీప్ మాట్లాడుతూ.. ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇటీవల ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఇలాంటి మూవీస్ అసలు తీయనియకూడదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ కామెంట్స్ నన్ను నిజంగానే బాధపెట్టాయి. నేను ఏదైనా నేరం చేశానా అనిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి అలాంటి విమర్శలు చేస్తున్నారు అనిపించింది.
చాలా కోపం వచ్చింది. ఆ టైంలో నేను ఒకటే అనుకున్నా.. ఐఏఎస్ అధికారి కావాలంటే ప్రముఖ సంస్థల్లో చేరి.. కష్టపడి పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదే ఫిలిమ్ మేకర్ లేదా, రచయిత కావాలంటే కోర్సులు, టీచర్లు ఉండరు. మనకి మనంగా నేర్చుకోవాలి. మన అభిరుచికి తగ్గట్టుగా ముందుకు సాగాలి. ఈ విషయాన్ని నేను పేపర్ పై కూడా రాసిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. ఎవరికి ఎలా కౌంటర్ ఇవ్వాలో.. ఎవరికి ఎలా సరైన సమాధానం చెప్పాలో ఈయనకు బాగా తెలుసు అని.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.