ప్రభాస్ ఫౌజీ విలన్ గా ఆ స్టార్ యాక్టర్ ఫిక్స్.. అసలు ఊహించలేరు..?

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తను నటించిన ప్రతి సినిమాతోనే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. వారిని తన అభిమానులుగా మార్చేసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీతారామం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని తిరుగులేని పాపులారిటీని దక్కించుకున్నాడు హ‌నురాఘవపూడి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌తో మరోసారి ఫౌజి సినిమాను తెరకెక్కించి అంతకుమించిపోయే బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు.

ఇక సీతారామం మూవీని తెరకెక్కించిన అదే ఆర్మి బ్యాక్ డ్రాప్‌తో మరోసారి ఫౌజి సినిమాను కూడా రూపొందించనున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఆయన తెర‌కెక్కించే కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండే హ‌నురాగవపూడి.. యాక్షన్, ఎమోషన్స్ తో పాటే.. క్యూట్ లవ్ స్టోరీని కూడా రన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే దాదాపు సినీ ఆడియన్స్ అంతా హ‌నురాగపూడి సినిలపై ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా ఇప్పటివరకు హనురాఘవపూడి తెర‌కెక్కించిన‌ సినిమాలు.. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా.. మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.

అంతేకాదు.. ఆయన తెర‌కెక్కించే సినిమాల్లో విలన్‌ను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సెలెక్ట్ చేసుకుంటాడు. తన సినిమాలో విల‌న్‌ ఎవరనేది ఫస్ట్ నుంచి సస్పెన్స్.. క్లైమాక్స్లో రివీల్ చేస్తాడు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన సీతారామం సినిమాలో కూడా అదే స్ట్రాటజీని వాడాడు హ‌ను. ఇప్పుడు.. అదే తరహా స్క్రీన్ ప్లే ఫౌజీలో వాడబోతున్నాడని సమాచారం. ఓ స్టార్ యాక్టర్ను విలన్ గా ఫిక్స్ చేశాడ‌ని టాక్. కానీ అత‌నెవ‌రో మాత్రం రివీల్ చుయ‌లేదు టీం.  ఇక సినిమా హ‌నురాగపూడి కెరీర్‌లో ఎలాంటి ఇమేజ్ను తెచ్చి పెడుతుందో.. ప్రభాస్‌కు ఏ రేంజ్‌లో సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ప్ర‌భాస్‌ అభిమానులంతా ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ.. పాన్ ఇండియాను షేక్‌ చేస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.