టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిజీలైనప్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్, ఫౌజి సినిమాల షూట్‌లలో సందడి చేస్తున్న ప్రభాస్.. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ స్టోరీ.. అంచనాలకు తగ్గట్టుగానే.. ఎన్నో ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందనుందని సమాచారం.
ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ పై మాట్లాడుతూ.. సినిమా టార్గెట్ లెక్కల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్పిరిట్ రూ.2000కోట్ల కలెక్షన్లు కొల్లగొడితే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సందీప్ రెడ్డి ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో తెరకెక్కించింది కేవలం మూడు సినిమాలైనా.. తన ప్రతి సినిమాతోను అంతకంతకు క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే స్పిరిట్ మూవీ బాహుబలి 2 సినిమాను దాటాలంటే రూ.2000 కోట్లు రావాలంటూ వెల్లడించాడు. అంతేకాదు.. ఈ సినిమా టార్గెట్ చిన్న టార్గెట్ కాదు.
చాలా పెద్దది అంటూ చెప్పుకొచ్చాడు. నా వంతుగా నా పూర్తి ఎఫర్ట్ పెట్టి.. సినిమాను తెరకెక్కిస్తానంటూ వెల్లడించాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ తెచ్చి పెడుతుందో వేచి చూడాలి అంటూ.. ఆయన చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డివంగా కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఆయన టార్గెట్ కు తగ్గట్టుగానే రెండువేల కోట్ల కలెక్షన్లు ప్రభాస్ స్పిరిట్‌కు వస్తే మాత్రం.. అది పెద్ద సంచలనమే అవుతుంది అనడంలో సందేహం లేదు. కాగా.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ క్రమంలోనే చాలావరకు సౌత్ స్టార్లు తన డైరెక్షన్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓవైపు దర్శకుడుగా సినిమాలు తీస్తూనే.. తన కుటుంబ సభ్యులనే నిర్మాణ భాగస్వాములుగా తీసుకోవడంతో ఆయన మరింత లాభాలు అర్జిస్తున్నాడు. ఇక రానున్న రోజులో ఆయన కెరీర్ ప్లాన్స్ ఏవిధంగా ఉండనున్నాయో వేచి చూడాలి.