టాలీవుడ్ సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ అనగానే దర్శకధీరుడు రాజమౌళి తర్వాత.. అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ఇక అనిల్ తన సినిమాలతో ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి ప్రధాన కారణం.. ఏ హీరో ఇమేజ్ను బట్టి ఆ హీరోకు తగ్గ కథలను రాయడం. అంతేకాదు.. ఆయన తెరకెక్కించబోయే సినిమా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. రెండు నుంచి మూడు నెలల్లో సినిమాను సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. వరుస సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే.. అనిల్ నుంచి నెక్స్ట్ రాబోయే చిరంజీవి సినిమా విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకుంటున్నాడని.. ఆయన స్టార్‌డంకు తగ్గట్టుగా స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తుంది.
అంతేకాదు.. సినిమా కథ విషయంలో రిస్క్ తీసుకోకుండా వింటేజ్ చిరంజీవితో ఆడియన్స్‌ను మెప్పించేలా ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ఇంతకీ చిరు విషయంలో అనిల్ రావిపూడి చేస్తున్న ఆ మ్యాజిక్ ఏంటో.. అసలు స్టోరీ విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ సినిమాలో ఆయనకు బాగా కలిసివచ్చిన డబల్ రోల్ కాన్సెప్ట్‌లు తీసుకోనున్నాడట అనిల్. ఇక చిరు.. కెరీర్ మొదటి నుంచి డ్యూయల్ సినిమాలతో ఎక్కువగా సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు దొంగ మొగుడు, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించడంతోపాటు.. భారీ పాపులారిటీని తెచ్చిపెట్టాయి.
అంతేకాదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న చిరు.. రీ ఎంట్రీ తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 తోను డ్యూయల్ రోల్‌లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత చిరుకి ఇప్పటివరకు తన రేంజ్‌కు తగ్గ బ్లాక్ బస్టర్ పడలేదు. ఇలాంటి క్రమంలో.. అనిల్‌తో తాను చేయబోయే సినిమా రౌడీ అల్లుడు, దొంగ మొగుడు సినిమాలో తరహాలో ఉండబోతుందని చిరు చెప్పుకొచ్చాడు. చిరు చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో కూడా చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నాడని అర్థమవుతుంది. ఒకటి మాస్, మరొకటి కామెడీ.. రెండు కలిస్తే వింటేజ్ మెగాస్టార్ చూపించడం ఖాయమని తెలుస్తుంది. ఇక మే నుంచి అనిల్, చిరు సినిమా సెట్స్‌పైకి రానుంది. 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు టీం.