SSMB 29 పై బిగ్గెస్ట్ లీక్ ఇచ్చిన ప్రియాంక తల్లి.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ నుంచి తెర‌కెక్క‌నున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB 29పై ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుందని టాక్‌. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. త్వరలోనే రాజమౌళి అండ్ టీం.. క్యాస్టింగ్ ఇతర వివరాలపై ప్రెస్‌మీట్‌తో క్లారిటీ ఇస్తారని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రియాంక చోప్రా గ‌త‌ నెల రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ.. షూటింగ్‌ల‌లో సందడి చేస్తూనే.. మరో పక్క సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. ఈ క్రమంలోనే మీడియా ద్వారా అమ్మడికి విపరీతమైన పాపులారిటీ దక్కింది.

మహేష్, రాజమౌళి టీంతో క‌లిసి ఆమె పనిచేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి లీక్‌లు వస్తున్న ప్రియాంక మాత్రం దీనిపై ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక SSMB 29లో నటిస్తుందా అని ప్రశ్నించగా.. ఆమె తల్లి మధు చోప్రా సినిమా షూటింగ్లో బిజీగా ఉంది అని చెప్తూ హైప్‌ క్రియేట్ చేసింది. ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారా అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా ఎస్.. అంటూ ఆమె తల ఊపింది. ఓవైపు ప్రియాంక‌.. మహేష్ సరసన నటిస్తోందని ఊహగానాలు వైరల్ అవుతున్న క్రమంలో మధు చోప్రా దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. మధు.. టొరంటో నుంచి హైదరాబాద్‌కు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసే వీడియోలో.. ఈ విషయాన్ని లీక్ చేసింది. దీనిలో రోర్ ఆఫ్ ఆర్‌ఆర్ఆర్ బీజిఎమ్‌తో.. రాజమౌళి, పిసి కలిసి పనిచేస్తున్నారు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.

Madhu Chopra finally reveals if Priyanka Chopra is a part of SS Rajamouli, Mahesh  Babu's SSMB 29 | Bollywood - Hindustan Times

ఇక కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక.. చిలకలూరి బాలాజీ ఆలయాన్ని దర్శించుకుని ఫొటోస్ ను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. శ్రీ బాలాజీ ఆశీర్వాదాలతో కొత్త అధ్యయనం ప్రారంభమవుతుందంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో SSMB 29 సినిమాలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉందని ఫ్యాన్స్ భావించారు. నిర్మాతలు ప్రాజెక్టులో ఆమె పాత్రను అఫీషియల్‌గా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక విజ‌యేంద్ర‌ ప్రసాద్.. ఇండియన్ జోన్స్ ప్రారంతో ఈ కథను రాసుకున్నాడు. ఇక ఓ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక ఈ ఏడది జనవరిలో హైదరాబాద్‌లో షూటింగ్ అఫీషియల్‌గా ప్రారంభించిన టీం.. మహేష్ బాబు లుక్స్ ను గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన వివరాలు ఏవి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే దీనిపై రాజమౌళి సమాచారం అందిస్తారని టాక్.