తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కు దర్శకుడుగా వ్యవహరించి భారీ పాపులారిటి దక్కించుకున్నారు వివి వినాయక్. అయితే.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన.. అనారోగ్యంతో శతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్‌స్లంటేషన్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి.. పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న వినాయక్.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యాడని సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హటాహుటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే వినాయక్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని.. ఆయన్ను పరామర్శించేందుకు ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పాటు.. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా.. ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కలిసినట్లు సమాచారం. ఎక్సపిరియన్స్‌డ్ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుత ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. సినిమాల సంగతి కాస్త పక్కన పెట్టి ఆరోగ్యం పై పూర్తి దృష్టి సారించాలని డాక్టర్స్ ఆయనకు సూచించారట. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. పూర్తి విశ్రాంతి ఉండాలని డాక్టర్లు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో వినాయక్ టాలీవుడ్‌కు డైరెక్టర్గా పరిచయం అయ్యాడు.
ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సంచలన సక్సెస్ సాధించి.. మొదటి సినిమాతోనే స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. తర్వాత చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, బన్నీ, అదుర్స్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను టాలీవుడ్‌కు అందించి తిరుగులేని దర్శకుడుగా రాణించాడు. అయితే.. మెల్ల మెల్లగా వరుస ఫ్లాప్‌లతో సినిమాలకు దూరమైన వినాయక్.. చివరిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి ఛత్రపతి హిందీ రీమిక్స్ తెరకెక్కించారు. సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత సినయ్య అనే సినిమా ప్రాజెక్టును అనౌన్స్ చేసినా.. అది సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయింది. తర్వాత.. మరో ప్రాజెక్ట్ ఏది వినాయక ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఆయన పూర్తిగా కోలుకొని.. మళ్లీ ఇండస్ట్రీలో రాణించాలని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.