టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ , దేవర లాంటి వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత నటిస్తున్న తాజా మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు.. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇండియన్ రాఏజెన్సీలో ఉన్న జవాన్.. ఎన్టీఆర్‌ని మోసం చేసి.. శత్రు సైన్యాన్ని వదిలేసి.. వెన్నుపోటు పొడిచిన కారణంగా ఇండియాపై పగతో.. టెర్రరిస్ట్‌గా మారి.. జవాన్‌లపై రివెంజ్ తీర్చుకునే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడట. ఇక క్లైమాక్స్ లో తప్పు తెలుసుకుని మంచివాడిగా మరి.. టెర్రరిస్ట్ సామ్రాజ్యాన్ని స్వయంగా తానే కూల్చేస్తాడా.. లేదా నిజం తెలుసుకోకుండా చివరి వరకు పగతో టెర్రరిస్ట్‌గానే మిగిలిపోతాడా అనేది థియేటర్లలో చూడాలి.
ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు రూపొందుతున్నాయి. కియారా అధ్వని ఇందులో హీరోయిన్గా మెరవనుంది. కాగా ఈ సినిమా అగష్ట్ 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చిన రోజున అనౌన్స్ చేశారు. కానీ.. మధ్య మధ్యలో షూట్ వాయిదా పడడంతో.. సినిమా రిలీజ్‌కు ఆలస్యం అవుతుందని.. అంతా భావించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా వాయిదా పడిందని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కానీ.. ఇక ఆగస్టు 15వ ఇండిపెండెన్స్ డే కావడంతో ఆ స్పషల్ డే కూడా.. దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 14న మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే సినిమా షూట్ చివరి దశలో ఉందని.. ప్రమోషన్ కార్యక్రమాల కోసం అంత సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ చేస్తారని మొదట వార్తలు వినిపించినా అదేమీ లేదని తేల్చేశారు మేకర్స్. అయితే ఆగస్టు 14న సినిమా రిలీజ్ కావడం మాత్రం ఖాయమని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఫ్యాన్స్ కు, మూవీ లవర్స్ కి విజువల్ ఫస్టుగా ఉండబోతుందని.. యాక్షన్ తో ఆడియన్స్ను అద్యంతం ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తుంది. హృతిక్ రోషన్, తారక్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కు తీసుకువస్తాయట. వీరిద్దరి మధ్య వచ్చే డ్యాన్స్ కూడా కనీవిని ఎరుగని రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లోకి తారక్ అడుగుపెట్టనున్నాడు. రీసెంట్ గానే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన టీం.. ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.