ఒకే స్టేజిపై పవన్ ప్రభాస్ కనిపించనున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ విన్న దీని గురించి చర్చ జరుగుతుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఒకే స్టేజిపై కనిపించబోతున్నారనే న్యూస్ ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడెప్పుడో.. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సందడి చేశారు. అది వీరిద్దరూ కలిసి పంచుకున్న మొదటి, చివరి వేదిక కూడా. తర్వాత కృష్ణంరాజు చనిపోయిన సమయంలో తప్ప.. మారెప్పుడూ వీరిద్దరు కలిసిందే లేదు.
ఇప్పటివరకు స్టేజ్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు చాలాకాలం తర్వాత మరోసారి వీరిద్దరూ ఒకే వేదికపై కలవబోతున్నారని టాక్. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ కన్నప్పలో రుద్ర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన టీజర్ చివర్లో ప్రభాస్ కనిపించి ఆడియన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంతో మంది ఫ్యాన్స్ కచ్చితంగా సినిమాలు థియేటర్లో చూస్తామంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కచ్చితంగా సినిమా ఈవెంట్‌లో పాల్గొంటారు.
ఇక.. ఇతర హీరోలతో ఎలాంటి విభేదాలు ఉన్న మోహన్ బాబుకు.. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌తో మాత్రం మంచి బాండ్ ఉంది. ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు సరదాగా కొట్టుకోవడం లాంటి సన్నివేశాలు ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే.. పవన్ కళ్యాణ్ కూడా మోహన్ బాబు పిలిస్తే ఖచ్చితంగా కన్నప్ప ఈవెంట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే వేదికపై కనిపించబోతున్నారని టాక్ ఆడియన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. ఇదే వార్త అఫీషియల్‌గా ఫిక్స్ అయితే.. ఇక ఫ్యాన్స్‌కు పండుగే. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.