అఖండ 2 క్లైమాక్స్ దిమ్మతిరిగే ట్విస్ట్.. పార్ట్ 3 కి పర్ఫెక్ట్ ప్లాన్..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మ‌హ‌రాజ్‌తో బ్లాక్ బస్టర్ అంతదుకుని దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాపై కూడా ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచ‌నాలు నెలకొల్పాడు. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బ్లాక్ బాస్టర్ అఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు తెరకెక్కి మూడు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అఖండ 2 విషయంలో.. ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్.. సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

BB3 titled as 'Akhanda': Balakrishna roars as Aghori in Ugadi teaser |  Telugu Movie News - Times of India

ఇక ఈ సినిమాలో బాలయ్య అఖండ పాత్రలో పవర్ ఫుల్‌గా మెరువనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ అదేంటో ఒకసారి తెలుసుకుందాం. అఖండ 2తో బాలయ్య మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. గతంలో తెరకెక్కిన అఖండ నార్త్ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. హిందీ డబ్బింగ్ తో మంచి ఆదరణ లభించింది. ఈ నేప‌ద్యంలో అఖండ 2 పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు టీం. ఇక బోయపాటి ప్లానింగ్.. బాలయ్య‌ సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ఊహించని విధంగా సరికొత్తగా ఉంటుంది. ముఖ్యంగా అఖండ 2లో బాలయ్య ఎలివేషన్స్, యాక్షన్స్ పీక్స్ లెవెల్ లో ఉండనున్నాయని.. పార్ట్-3 కి సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ సినిమా క్లైమాక్స్ లో రివిల్ చేయనున్నాడని తెలుస్తోంది.

Akhanda 2 - Thaandavam': Nandamuri Balakrishna's next with Boyapati Sreenu  launched - The Hindu

అఖండ 2 పూర్తి ఆధ్యాత్మికతతో రూపొందుతుండగా.. క్లైమాక్స్ లో ఊహించని మలుపుతో అఖండ 3 కి లీడ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా షూట్ ఇప్పటికే ప్రయాగరాజ్ మహా కుంభమేళలో ప్రారంభమై.. అక్కడ షూట్ పూర్తి చేసి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ ను కంటిన్యూ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను 14 రిలీస్ బ్యానర్ పై.. రామ్ ఆచంట, గోపిచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్ర‌గ్య జైశ్వాల్‌ హీరోయిన్గా మెరవనుంది. ఈ సినిమాకు కూడా.. బాలయ్య‌ గత సినిమాలకు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు థ‌మ‌న్‌ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ ముగ్గురు క్రేజీ కాంబోపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెల‌కొన్నాయి. సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.