అతనికి 100 సార్లు చెప్పా. . డైరెక్టర్ కి నాగ వంశీ ఓపెన్ వార్నింగ్..!

సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే.. ఓ సినిమాను తెర‌కెక్కించి సక్సెస్ అందుకుంటే.. ఆ సినిమాలో నటించిన హీరోలకు, లేదా తెర‌కెక్కించిన దర్శకులకు అభిమానులు ఏర్పడటం కామ‌న్. కానీ.. నిర్మాతలకు ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఒక నిర్మాత ఉన్నారు. ఆయన మైక్ పట్టుకున్నాడు అంటే విజిల్స్ మోత మోగిపోతుంది. ఇంతకీ ఆ క్రేజీ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పలేదు కదా.. సితార బ్యానర్స్ అధినేత ద వన్ అండ్ ఓన్లీ.. సూర్యదేవర నాగ వంశీ. తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నాడు. మీడియం బడ్జెట్ సినిమాల్లో ప్రొడ్యూస్ చేస్తూనే.. వరుస సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఇక నాగ వంశీ నుంచి ఓ ప్రెస్‌మీట్ రిలీజ్ అయింది అంటే చాలు.. ఇక సోషల్ మీడియాకు, మేమర్స్‌కు సరిపడా స్ట‌ఫ్‌ని ఇస్తాడు.

Much-awaited MAD Square seals its release date | Latest Telugu cinema news  | Movie reviews | OTT Updates, OTT

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లోను నాగ‌ వంశీ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి. మ్యాడ్‌ స్క్వేర్ ప్రెస్‌మీట్‌లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. మ్యాడ్‌స్క్వేర్ సినిమా గురించి మాట్లాడుతూనే.. మరిన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నాగ వంశీ. ముఖ్యంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో మొదలు కాదని షాకింగ్ అప్డేట్ రివీల్ చేశాడు. ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొప‌క్క మ్యాడ్ స్క్వేర్‌ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌పై షాకింగ్‌ కామెంట్స్ చేశాడు. ఇంటర్వ్యూలో మీడియా చూస్తుండగానే దర్శకుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. టీజర్ కోసం మరీ చీప్ గా రూ.116 చదివించారు ఏంటి సార్ అని అడిగిన ప్రశ్నకు.. ఇప్పటికే నా దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి అందుకే రూ.116 చదివించా అంటూ చెప్పుకొచ్చాడు.

తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గురించి మాట్లాడుతూ.. మా డైరెక్టర్‌కి చాలా సార్లు చెప్పాను. స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏదిపడితే అది మాట్లాడొద్దు.. మైకు దొరికితే ఇష్టం వచ్చినట్లు వాగోద్దు.. అస్సలు బాగోదు అంటూ వివరించిన కూడా ఆయన వినట్లేదు అంటూ ఫైర్ అయ్యాడు నాగ వంశీ. మైక్ చేతిలో ఉన్నప్పుడు మాట అదుపులో ఉండాలని.. కళ్యాణ్ శంకర్‌కు మీడియా ముందే వార్నింగ్ ఇచ్చాడు. అయితే మ్యాడ్‌ కంటే ఇది 10 రెట్లు.. 20 రెట్లు ఎక్స్ట్రా ఉంటుంది అంటూ అనవసరమైన బిల్డప్ సినిమాకు అసలు వద్దు అని కామెంట్స్ చేశాడు. ఇక తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా విషయంలో నాగ‌ వంశీ ఇలాంటి కామెంట్స్ చేయ‌డం అందరికీ షాక్‌ను కలిగిస్తున్నాయి. ఇక మార్చ్ 29న‌ సినిమా రిలీజ్ కానుంది. అయితే ముందు రోజు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో.. ఒకవేళ పవన్ వస్తే తమ సినిమా వాయిదా పడుతుందని చెప్పాడు నాగ వంశీ.