క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సక్సెస్ లతో రాణిస్తున్న ఈ అమ్మడు.. గోల్డెన్ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇలాంటి క్రమంలో.. సంయుక్త మద్యం తాగడం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత తన పేరు నుంచి మీనన్‌ను తొలగించింది సంయుక్త. ఇక ఈ మలయాళ సోయగం తాజాగా తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఆమెకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సంయుక్త.. తాజాగా కుంభమేళాకు వెళ్లి పుష్య స్నానాలు చేసి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. కేరళ స్టైల్ వంటకాలు అంటే ఆమెకు ఎంత ఇష్టమైని తాను షేర్ చేసుకుంది. తను అప్పుడప్పుడు ఆల్కహాల్ కూడా తీసుకుంటానని.. అయితే ఒక కండిషన్.. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునే టైం లో మాత్రమే ఆమె ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ఇక్కడ లేడీ ఆర్టిస్టులను ఎంతో మర్యాదగా చూస్తారని.. ప్రవర్తిస్తారని.. సినిమాల్లో గ్లామర్ గా చూపించిన బయట మాత్రం హుందాగా ఉంటారని వివరించింది.
తోటి ఆర్టీసీలు బాగా నటిస్తే.. తాను కూడా బెస్ట్ గా నటించగలనని, అవతలి ఆర్టిస్ట్ సరిగ్గా చేయకపోతే నేను కూడా సరిగ్గా కాన్సెంట్రేట్ చేయలేనంటూ వివరించింది. ఫిక్షన్ నవలలు, మన దేశ సంస్కృతిని తెలియజేసే నవలలు అంటే నాకు చాలా ఇష్టం అంటూ సంయుక్త చెప్పుకొచ్చింది. అయితే సంయుక్త అఖండ సీక్వెల్ లోను కీలక పాత్రలో నటిస్తున సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతే కాదు ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు త్వరలోనే ఈమె అనౌన్స్ చేయనుందని టాక్. ఈ క్రమంలోనే అభిమానులు ఇదే సక్సెస్ రేట్లు కొనసాగిస్తూ.. మరింత మార్కెట్ ను పెంచుకోవాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.