టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఏడుపాదుల వయసులోని యంగ్, ఫిట్నెస్ లుక్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగ్.. ఈ జనరేషన్ అమ్మాయిలను సైతం తన అందంతో మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వైరల్ గా మారాయి. అయితే తర్వాత వాళ్లతో నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదని.. అవి రూమర్ల అని తేలిపోయింది. కానీ.. ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం ఇప్పటికి నాగార్జునతో మంచి బాండ్‌ను కొనసాగిస్తూనే ఉందట. అమలా మిడ్‌నైట్ నాగార్జున పక్కనే ఉన్న కూడా.. ఆయనకు ఫోన్ చేసి ఎంతసేపైనా మాట్లాడుతుందట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ బ్యూటీ టబ్బు. వీళ్ళిద్దరి కాంబోలో ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీంతో.. టబ్బు, నాగార్జున మధ్య ఎఫైర్ నడుస్తుందని.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ తెగ వార్తలు వినిపించాయి. అమలా ఇన్వాల్వ్ అయ్యి టబ్బును మందలించడంతో తను నాగార్జునకు దూరమైందని.. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేసుకోకుండా సింగల్‌గా ఉండిపోయిందని అంటారు.
కానీ.. నాగార్జున మాత్రం ఎప్పటికప్పుడు దీనిపై రియాక్ట్ అవుతూ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందంటూ.. ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా.. మా ఇంటికి వచ్చేస్తుందంటూ వివరించాడు. అంతేకాదు నాగార్జున ఇంటి ఎదురుగానే టబ్బు ఇల్లు కూడా కనుక్కుందని.. టబ్బుకి మూడ్ ఆఫ్ అయినా.. ఏదైనా బాధ కలిగిన.. అది అర్ధరాత్రి సమయమైనా సరే నాగార్జున పర్సనల్ నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుందని వివరించాడు. అమలా పక్కనే ఉన్న నాగార్జున తన ఫోన్ లిఫ్ట్ చేస్తాడని.. ఈ విషయం అమ్మలకు కూడా తెలుసు అని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారు. అంతే కాదు అప్పుడప్పుడు తనని ఆట పట్టించడానికి కూడా మిడ్‌నైట్ కాల్ చేస్తుందట. ఇక ప్రస్తుతం నాగార్జున.. సినిమాల విషయానికొస్తే రజనీకాంత్.. కూలీ, ధనుష్.. కుబేర సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.