ఫ్యాన్స్‌కు బిగ్‌ గుడ్ న్యూస్.. చరణ్‌తో కరణ్.. ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలు…!

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌కు టాలీవుడ్‌లోను పరిచయాలు అవసరం లేదు. కరణ్ జోహార్ నుంచి ఓ మూవీ వ‌స్తే అది సూపర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కరణ్. ఇక టాలీవుడ్ బాహుబలి సిరీస్ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించడానికి కరణ్ జోహార్ కూడా ఓ కారణం. కనివిని ఎరుగని రేంజ్లో సినిమా రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేలా చేసాడు. ఈ క్రమంలోనే కొంతకాలం నుంచి.. బాలీవుడ్‌ హీరోల నుంచి టాలీవుడ్ హీరోల వైపు ఆయన దృష్టి మారింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోల క్రేజ్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇలాంటి క్రమంలోనే అక్కడ హీరోలతో సినిమాలు తీస్తే కేవలం నార్త్ వరకే వసూళ్లు వస్తాయి. ఇక సౌత్‌లోనూ ఇమేజ్ రావాలంటే.. టాలీవుడ్ హీరోలతో సైతం సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.

Karan johar announced his new directorial film on his 52th birthday करण  जौहर ने अपने बर्थडे पर अनाउंस की नई फिल्म, एक्टर्स के नाम के एलान का इंतजार  कर रहे हैं फैंस,

సౌత్, నార్త్‌.. ఓవర్సీస్ అన్నీ కలిసి వచ్చేలా కరణ్ జోహార్ దృష్టి టాలీవుడ్ సినిమాలపై మ‌ళించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కరణ్‌ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు వీరిద్దరి కాంబోలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందేలా ప్లాన్ చేస్తున్నాడట. అందులో ఒకటి కిల్ డైరెక్టర్ నిక్కిలి నగేష్ భ‌ట్‌తో ఉండ‌నుంద‌ని టాక్. ముందుగా ఈ ప్రాజెక్టు విజయ్ దేవరకొండ హీరో అంటూ వార్తలు వినిపించాయి. అయితే కారణం తెలియదు కానీ.. ఈ ప్రాజెక్టును ఇప్పుడు రామ్ చరణ్ కి షిఫ్ట్ చేశాడట కరణ్‌. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు చరణ్‌తో తెర‌కెక్కించబోయే మరో రెండు ప్రాజెక్టులకు కూడా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ ని కరుణ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Ram Charan's Fav Actor & Actress

చరణ్ కి మొదటి నుంచి నార్త్ బెల్ట్ లో మంచి క్రేజ్ ఉంది. మగధీర తర్వాత ఆయన పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జంజీర్ సినిమాలు రీమేక్ చేస్తూ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సినిమా డిజాస్టర్ కావడంతో రూ.30 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ.. ఇదే సినిమా టీవీ టెలికాస్ట్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ మరో లెవెల్ కు వెళ్ళింది. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ గా నిలిచిన హిందీ వర్షన్ లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక‌ చరణ్ కు బాలీవుడ్లో మంచి ఇమేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. సరైన సినిమా పడాలి కానీ.. అక్కడ రామ్ చరణ్ మార్కెట్ వేరే లెవెల్‌కు వెళ్తుంది. ఈ క్రమంలోనే కరణ్‌తో సెట్ చేసుకునే మూడు సినిమాలు చరణ్ కు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసి పెట్టాలని.. బాలీవుడ్ లోను మంచి సక్సెస్ లో అందుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు.