గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్‌ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ లెవెల్‌లో స‌త్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయ‌డానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, పరిచయాలకు కూడా విలువ ఇస్తున్నాడని తెలుస్తుంది. అలా.. ప్రస్తుతం బన్నీ తన సినిమాను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ దిల్ రాజుకు ఇచ్చాడని సమాచారం.

అల్లు అర్జున్ కెరీర్ లోనే దిల్ రాజు స్పెషల్ పర్సన్. తన కెరీర్‌లో మొట్టమొదటి హిట్ ఆర్య సినిమాను.. దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత పరుగు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం దిల్ రాజు డౌన్ ఫాల్ ఎదుర్కొంటున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి ఫ్లాప్ సినిమాతో భారీగా నష్టపోయిన దిల్ రాజుకు.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ మాదిరిగా ఒడ్డున పడేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. దిల్ రాజుకు డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. దిల్ రాజు కూడా బన్నీకి సరిపడా స్క్రిప్ట్ కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక దిల్ రాజుకు, అల్లు అర్జున్ కు నిర్మాత, నటుడి కంటే మించిన స్నేహమే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాప్ నడుస్తుంది.

ఎప్పటికప్పుడు వీరిద్దరూ పర్సనల్గా కలుస్తూనే ఉంటారట. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 వివాదంలో దిల్ రాజు ప్ర‌త్యేక భాద్య‌త‌ తీసుకొని.. ముఖ్యమంత్రిని కలిసి ఈ వివాదానికి పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఇక ఇప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైన దిల్ రాజుకు హెల్ప్ చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యాడట. రీసెంట్గా దిల్ రాజుతో ప్రైవేట్ గా మాట్లాడిన బ‌న్ని.. కథ నచ్చితే సినిమా చేసేద్దామని దిల్ రాజుతో చెప్పాడని.. ఈ క్రమంలోనే సరైన డైరెక్టర్ కథ కోసం దిల్ రాజు వెతుకుతున్నట్లు సమాచారం. అంతా ఓకే అయితే.. 2027లో బన్నితో దిల్ రాజు సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.