నందమూరి నటసార్వభౌమ తారక రామారావు.. నటవారసుడిగా ఇండస్ట్రీకి కొడుకు బాలయ్యను పరిచయం చేశాడు. హీరోగా బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కథలు ఎంపికలు విషయంలో తాను కూడా భాగమయ్యే వారు. అప్పట్లో గొప్ప దర్శకులతో కొడుకు బాలయ్య సినిమాలను ఫిక్స్ చేసేవాడు. కాగా 80,90లలో ఇండస్ట్రీని ఏలిన ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో.. ఎన్నో సూపర్ హిట్, ఇండస్ట్రియల్ హిట్స్ పడ్డాయి. ఇక పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్‌గా వ్యవహరించేవారు. కథ, మాటలను అందించడంలో వారికి తిరుగులేదు. ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్.. ఎన్టీఆర్‌కు ఓ కథను వినిపించారట. ఇక కథ ఆయనకు బాగా నచ్చింది.
బాలకృష్ణ పోలీస్‌గా చాలా బాగుంటాడు.. బాలయ్య ఈ సినిమాలో చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ చేశాడట. డైరెక్టర్గా ఏ.కోదండరామిరెడ్డిని సెలెక్ట్ చేసుకుని.. పరచూరి బ్రదర్స్, కోదండరామిరెడ్డిని కూర్చోబెట్టి కథ వినిపించాడట ఎన్టీఆర్. కథ ఎలా ఉంది బ్రదర్ అని కోదండరామిరెడ్డిని.. ఆయన అడగగా నాకైతే స్టోరీ నచ్చలేదు సార్ అని మొహమాటం లేకుండా చెప్పేసాడట. దర్శకుడికి కథ నచ్చకపోతే సినిమా ఎలా చేస్తాం.. ఇంకో కథ రాయండి అని పరుచూరి బ్రదర్స్‌కు ఎన్టీఆర్ వివరించాడట. ఇక బయటకు వచ్చాక పరుచూరి బ్రదర్స్.. కోదండరామిరెడ్డిని ఆయనకు ఎంతో బాగా నచ్చిన కథను నచ్చలేదు అన్నావ్ ఏంటయ్యా అన్నారట.
కొన్ని రోజులు తర్వాత డైరెక్టర్ కి ఫోన్ చేసిన ఎన్టీఆర్.. ఆ కథ ఎందుకో బాలయ్యకు బాగా సెట్ అవుతుందని నా నమ్మకం.. మీరు సినిమా చేయండి అన్నాడట. దాంతో చేసేదేమీ లేక కోదండరామిరెడ్డి సినిమా సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఇక బాలయ్య కూడా సినిమా చేస్తున్న టైంలోనే సినిమా డిజాస్టర్ అని తేల్చేసాడట. ఫైనల్ గా సినిమా ధియేటర్లోకి వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. అదే తిరగబడ్డ తెలుగు బిడ్డ మూవా. 1988లో రిలీజ్ అయిన ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్గా కనిపించారు. ఇక ఈ కథ విషయంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ రాంగ్ అయింది. బాలయ్య మాత్రం కథ వర్కౌట్ కాదని ముందే చెప్పేసాడు. కోదండరామిరెడ్డి మాట వినకుండా ఎన్టీఆర్.. బాలయ్యతో సినిమా తీసి ఒక డిజాస్టర్‌ను ఇచ్చాడు.