గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా పాపులారిటి దక్కించుకున్న సెలబ్రిటీకి ఎవరైనా ఉన్నారా.. అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ అనడంలో అతిశయోక్తి లేదు. తండ్రితో కలిసి ఇటీవల కాలంలో తెగ తిరిగేస్తున్నాడు అకీరా. ఇందులో భాగంగానే తాజాగా ఆధ్యాత్మిక యాత్రలోనూ సందడి చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా అకిరా హైలెట్ అవుతున్నాడు. అందం, కటౌట్‌తో పవన్ కళ్యాణ€్నే డామినేట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కచ్చితంగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక పవన్ ఓ పక్క రాష్ట్ర రాజకీయాల్లో, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పలు కీలక శాఖల మంత్రిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. దీంతో పాటు మరో పక్క.. ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్న మూడు సినిమాలకు డేట్స్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు. అలాంటిది.. భవిష్యత్తులో ఆయన సినిమాలు చేస్తాడా అంటే.. అది కచ్చితంగా అసంభవం. ఈ క్రమంలోనే ఆఖీరా ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో అతని తల్లి రేణు దేశాయ్‌కు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని.. తాను ఏం చేయాలనుకుంటే అదే చేసే ఫ్రీడం నేను ఇస్తున్నాను అంటూ వెల్లడించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అకిరా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయి పవన్ కు నటన నేర్పిన.. సత్యదేవ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే కోచింగ్ తీసుకున్నారు.
ఈ క్రమంలోనే రెండేళ్లలో ఆఖీరానందం టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ లెవెల్‌లో ఉండబోతుందట. మెగా వవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న అశ్విని దత్.. అకిరా నందన్ ఎంట్రీ బాధ్యతలు కూడా తీసుకున్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్‌లోనే అకిరా నందన్ సినిమా కూడా ఉండనుందట. ఇక అంతకుమించిన బ్లాస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకుడుగా ప్రశాంత్ నీల్ వ్యవహరించినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో పంజా లాంటి స్టైలిష్ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ కూడా అకిరా మొదటి సినిమాకు డైరెక్టర్గా పనిచేయనున్నట్లు టాక్ నడుస్తుంది. వీళ్ళలో ఎవరో ఒకరు అకిరా మొదటి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించరున్నారు అనేది మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో.. అకిరా తన తండ్రిలాన్నే స్పెషల్ స్టైల్, నటనతో యూత్‌ను ఆకట్టుకుంటాడో.. లేదో.. ఏ రేంజ్ లో మెప్పిస్తాడో తెలియాలంటే ఎంట్రీ వరకు ఆగాల్సిందే.