పెను వివాదంలో రాజమౌళి.. అలీంటి వీడియో రిలీజ్‌..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తాజాగా షాకింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో రాజమౌళి స్నేహితుడిగా ఉన్న యు. శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ఆయనను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయ‌డంతో ఆ విడియో తెగ వైర‌ల్‌గా మారింది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను, రాజమౌళి ఒకే మహిళను ప్రేమించామని.. ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందేమోనని తనపై ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

 

ఇక శ్రీనివాసరావు నిజంగానే రాజమౌళి స్నేహితుడని తెలుసు కానీ.. అతని మాటల్లో వాస్తవం ఎంతో తెలియదని ఇండస్ట్రీ వర్గాల‌లో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా.. రాజమౌళి ఈ వివాదానికి సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇంత పెద్ద వివాదం జరగడంతో ఆయన కొంతకాలం సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగానే ఉంటాడని.. ఏ విషయం పైన కూడా ఆయన రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడరని అంతా భావించారు. కానీ.. రాజమౌళి దానికి ఫుల్ ఆపోజిట్‌గా సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఆయన కీరవాణి లైవ్ కాన్సర్ట్ గురించి మాట్లాడుతూ.. మార్చి 22వ తేదీన ఈ లైవ్ కాన్సర్ట్‌ ఈవెంట్ జరగబోతుందని చెప్పుకొచ్చాడు. కీరవాణి తన సినిమాలోని సాంగ్స్‌తో పాటు.. ఆయన కంపోజ్ చేసిన ఎన్నోవేల‌ పాటలను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నాడని వివరించాడు. కీరవాణి లైవ్‌లో పెర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నా. అంతే కాదు.. ఆయన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడే కంపోజ్ చేయాలని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నా అంటూ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న క్రమంలో.. రాజమౌళి ఇలా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేయడంతో ఇది నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.