వాట్.. ప్రభాస్ కు ఆ హీరో అంటే అంత భయమా.. మాట్లాడాలంటేనే గజగజ వణికిపోతాడా..?

పాన్ ఇండియా రెబ‌ల్ స్టార్ ప్రబాస్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ద‌క్కించుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమా సమయంలో యాక్టింగ్ రాదంటూ.. అసలు వీడికి హీరో అయ్యా అర్హత లేదంటూ రకరకాల ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేశాడు. కానీ.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ ప్రభాస్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు.

Prabhas's uncle Krishnam Raju to play crucial role in Radhe Shyam - India  Today

ఈ క్రమంలోనే గ్యాప్ లేకుండా వరుస‌ ప్రాజెక్టులను నటిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రేజ్ దక్కించుకున్నాడు. అలాంటి ప్రభాస్.. తన పర్సనల్ లైఫ్‌లో ఓ హీరోతో ఫోన్‌లో మాట్లాడాలన్నా గజగజ వణికి పోతాడట. ఇంతకీ ప్రభాస్ అంతలా భయపడే ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు తమ కంటే సీనియర్ హీరోలపై భయం, గౌరవం ఉంటాయి. కానీ.. గజగజ వణికిపోయేంతలా ఎవరు భయపడరు. అయితే ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో పాటు.. మోహన్ బాబుకు కూడా చాలా భయపడతాడట. అయితే కృష్ణంరాజుతో సరదాగా మాట్లాడుతాడు గాని.. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవాలంటే మాత్రం తెగ మొహమాట పడిపోతాడు.

ఎన్ని జన్మలెత్తినా మోహన్ బాబు కొడుకుగానే పుట్టాలి... ప్రభాస్ పెళ్లిపై  విష్ణు కామెంట్స్

ఇక‌ మోహన్ బాబుతో మాత్రం ఫోన్లో మాట్లాడాలన్న వణికిపోతాడట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మా నాన్నగారు ఫోన్ చేస్తే ప్రభాస్ వ‌ణికిపోతాడని.. ఒకసారి కన్నప్ప మూవీ కోసం నాన్న స్వయంగా ప్రభాస్‌కు కాల్ చేసి నువ్వు ఈ సినిమాలో నటించాలని అడిగారు. అప్పటికే.. ప్రభాస్ వణికిపోతున్నాడు. ఓకే కచ్చితంగా చేస్తానని క్షణం కూడా ఆగకుండా చెప్పేసాడు. అయితే మళ్ళీ ఈ విషయాన్ని నాకు కాల్ చేసి చెప్తూ.. ఏదైనా విషయం ఉంటే నువ్వే నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పు. ఆయన దాకా రానివ్వకంటూ వివరించాడట‌. మా నాన్న కాల్ చేసిన ప్రభాస్‌కు మాట్లాడాలంటే చాలా భయం అంటూ వివరించాడు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.€