బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానికి టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సిద్ధార్థ మల్హోత్రను ప్రేమించి.. ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో ట్రెడిషనల్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షేర్షా సెట్స్‌లో ఒకరితో ఒకరి ప్రేమలో పడిన ఈ జంట.. తాజాగా తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత కియారా గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకుంది.
ఇక మొదటిసారి లవ్ స్టోరీస్ ముగింపు పార్టీలో కలుసుకున్న కియాఉర, సిద్ధర్ధ్‌ల పరిచయం కాస్త.. స్నేహంగా మారడం, తర్వాత ప్రేమ చిగురించడంతో చాలాకాలం డేటింగ్ కొనసాగించారు. 2019లో వీరిద్దరి డేటింగ్ వార్తలు వైరల్ గా మారాయి. తర్వాత 2021లో ఇరు కుటుంబాలు కలుసుకున్నారు. ఇక రెండేళ్ల గ్యాప్ తో 2023లో ఈ జంటకు వివాహం జరిగింది. ఈ క్రమంలోనే అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారుతుంది. తన ఇన్‌స్టా వేదికగా పాప సాక్స్ ఫోటోలను షేర్ చేస్తూ.. తను తల్లి కాబోతున్నట్లు అభిమానులతో పంచుకుంది కియారా.
మా లైఫ్ కు సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలోనే రానుంది అంటూ వివరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమ్మడి పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. దీంతో.. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు.. ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక కియారాకు అనారోగ్యంగా ఉందని.. ఈ కారణం తోనే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేకపోయిందంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆమె హాస్పిటల్ లో చేరిందనే టాక్ కూడా నడిచింది. ఇలాంటి క్రమంలో కియారా.. తల్లిని కాబోతున్నానంటూ షేర్ చేసుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.