నేషనల్ స్టార్ నాని టాలీవుడ్‌లో తన సహజ నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. స్మైల్ తోనే ఎంతోమందిని ఫిదా చేసిన ఈ హీరో పక్కింటి కుర్రాడిలా.. మాటతీరుతో అందరిని మెప్పిస్తాడు. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఇష్టపడుతూ ఉంటారు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పని చేసిన నాని.. అష్ట చమ్మ సినిమాతో అదృష్టాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా అవకాశాన్ని కొట్టేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ దక్కడంతో.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఈగ సినిమాలో క్రేజీ ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమా సక్సెస్ తో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అప్పటినుంచి వరుస సినిమాలో నటిస్తూ బిజీ గడుపుతున్న నాని.. లవర్ బాయ్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన దసరా సినిమాతో మాస్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం ప్రామిసింగ్ హీరోగా రాణిస్తున్న నాని ప్రస్తుతం తన ఒక్కో సినిమాకు రూ.30 నుంచి 35 కోట్ల రేంజ్ లో రెమ్యనరేషన్ అందుకుంటున్నాడు.
ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగాను మారి.. పలు సినిమాలను రూపొందిస్తున్నాడు. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఈయన.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను ప్రొడ్యూస్ చేసే రేంజ్‌కు ఎదగాడంటే.. ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఆయన కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే నాని అసలు పేరు మాత్రం చాలా మందికి తెలియదు. కేవలం నాని అంటేనే ఇండస్ట్రీ జనం సైతం గుర్తుపడతారు. అయితే నాని అసలు పేరు నవీన్ బాబు అట. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత క్యాచీగా ఉండాలని తన పేరును నానిగా మార్చుకున్నట్లు సమాచారం.