టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి పాపులారిటీ ఉంది. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. అక్కడ మంచి సక్సెస్ సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ప్రారంభమై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్లను కంటిన్యూ చేస్తున్నారు. అలా తాజాగా తెలుగులో ఎనిమిదవ సీజన్లో పూర్తి చేసుకుంది. అయితే మొదట భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 8.. చివరకు యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మరోసారి అలాంటివి జరగకుండా బిగ్‌బాస్ సీజన్ 9 విషయంలో పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు టీం.
గత సీజన్లో పెద్దగా తెలిసిన సెలబ్రిటీస్ ఎవరూ లేరని.. ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారి ముఖాలు కూడా తెలియని వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే సీజన్ 9లో అలా కాకుండా ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలను కంటెస్టెంట్లను తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే బడ్జెట్ కూడా సీజన్‌కు భారీగానే ప్లాన్ చేశారట. అయితే ఇప్పటివరకు చాలా సీజన్లకు నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో నాగార్జున హోస్టింగ్ పై కూడా విమర్శలు తలెత్తాయి. నెగెటివిటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే సీజన్ 9 నుంచి నాగ్‌ను తప్పించి ఆ స్థానంలో నందమూరి నటసింహం బాలయ్యను తీసుకురావాలని భావించారట.
కానీ.. బాలయ్య నో చెప్పేయడంతో.. రౌడీ స్టార్ వద్దకు చాన్స్ వెళ్ళింది. విజయ్ దేవరకొండ కూడా మొదట దీనికి ఆలోచించినా.. తర్వాత రెమ్యూనరేషన్ ను భారీ లెవెల్లో ఆఫర్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక విజయ్ దేవరకొండకు ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ ఇవనున్నారట బిగ్‌బాస్ టీం. ఇక హోస్టింగ్ అనేది సరికొత్త చాలెంజ్‌గా విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట.దీనికోసం పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. ఇక షోకు సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఇప్పటికే సీజన్ 9 లో పాల్గొనబోయే సెలబ్రిటీస్ వీళ్లేనంటూ చాలా మంది పేర్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే అఫీషియల్ గా బిగ్ బాస్ ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే.