టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న చరణ్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఆయన ఆర్సి16 ప్రాజెక్ట్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ పెట్టాలని కసితో ఉన్నాడు. చరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో తన 17వ సినిమాకు కూడా ఇప్పటికే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు.
కాగా ఈ మూవీ కోసం నాగార్జున బ్యూటీని ఫిక్స్ చేశారని.. అక్కినేని ముద్దుగుమ్మ చరణ్తో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు కన్నడ సోయగం ఆశిక రంగనాథ్. టాలీవుడ్ లో తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అమిగోస్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడతాయని అంతా భావించారు. కానీ.. అడపా దడపా సినిమాలు మాత్రమే ఛాన్స్ వచ్చాయి. కాగా అక్కినేని సీనియర్ హీరో నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాలో ఆయనకు జంటగా మెరిసింది. ఈ సినిమాతో కూడా అమ్మడికి మంచి క్రేజ్ దక్కించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలోను ఓ కీలక పాత్రలో అవకాశాన్ని దక్కించుకొని నటిస్తుంది. ఇలాంటి క్రమంలో అమ్మడికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది. చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్గా ఆశిక రంగనాథన్‌ను సెలెక్ట్ చేసుకున్నారని టాక్. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా.. ప్రస్తుతం ఇదే వార్త తెగ వైరల్ గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఆశికా జాక్పాట్ కొట్టేసిందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో చరణ్ – సుక్కు కాంబోలో రంగస్థలం వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆశిక, చరణ్ కెమిస్ట్రీ తెరపై ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ జంట చూడడానికి చాలా అందంగా ఉంటుందని.. కచ్చితంగా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజంగానే ఆశికా చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.