ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయని ఎన్నో అసలు పెట్టుకున్నారు టాలీవుడ్ అభిమానులు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోలు ఎవరు ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో ఆడియన్స్‌ను పలకరించడం లేదట. ఇలా అయితే.. ఇండస్ట్రీకి భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు మొదట అనుకొన్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాలి. అలాగే.. రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయని.. అనుకున్న సమయానికి రావడం అసాధ్యం అంటూ టాక్ నడుస్తుంది.
అయితే.. కనీసం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా అయినా మే నెలలో వస్తుందని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు ఆ సినిమా కూడా వాయిదా పడింది. ఇంకా సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయిందట. ఆ పనులు పూర్తయితే కానీ టీజర్‌కు వచ్చిన బ్యాడ్ ఫీడ్ బ్యాక్ రికవర్ చేసుకోవడానికి కుదరదు. ఈ క్రమంలోనే.. సినిమా విఎఫ్‌ఏక్స్ విషయంలో రీ వర్క్ చేస్తున్నారు టీం. ఈ క్రమంలోనే.. సినిమా మేలో రిలీజ్ కావడం కష్టమే అని సమాచారం. ఇక పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. నాలుగు రోజుల పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తవుతుంది. కానీ.. విఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉండిపోయిందట. ఈ క్రమంలోనే మార్చి నెలలో మిస్ అయితే ఏప్రిల్ లో సినిమా ఉంటుందని అంతా భావించారు.
కానీ.. ఇప్పుడు అది కూడా కష్టమే అని టాక్ నడుస్తుంది. విఎఫ్ెక్స్ వర్క్ చాలా సమయం పడుతుందని.. దాదాపు నెల రోజులైనా సమయం కావాలని అంటే ఏప్రిల్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు.. తర్వాత ప్రమోషన్స్ అంటూ కనీసం 20 రోజులైనా కేటాయించాలి. దీంతో మే నెలలో కూడా ఈ సినిమా రాకపోవచ్చు అని టాక్ నడుస్తుంది. ఇక.. ఈ నెలాకరులోపు రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సమ్మర్లో రాజాసాబ్ సినిమా వస్తుందని అనుకున్న వారంతా ఆశలు వదులుకోవాల్సిందే. ఆ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్సే లేదట. విశ్వంభర లానే.. రాజాసాబ్‌కు కూడా విఎఫ్ఎక్స్ సమస్య ఏర్పడిందని.. తాజాగా అవుట్ పుట్‌ను చూసి ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విఎఫ్ఎక్స్ అద్భుతంగా వస్తే కానీ సినిమా రిలీజ్ ను ప్రకటించవద్దని ఆయన చాలా గట్టిగా చెప్పేసాడట. దీంతో ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ వరకు రిలీజ్ అయ్యే అవకాశం లేదని అంతర్గత వర్గాల సమాచారం.