స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం లేదు. ప్రస్తుతం వరుస ఆఫర్‌లతో బిజీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోలేదు. ఇలాంటి స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. సొంత టాలెంట్‌తో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి ఇమేజ్ను దక్కించుకుంది. క్రాక్ సినిమాతో టాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. మాస్ లుక్ లో జయమ్మ పాత్రలో వరలక్ష్మికి మంచి క్రేజ్ దక్కింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు దక్కించుఎకుంటూ.. తమిళ్‌తో పాటు.. తెలుగులోను అమ్మడు భారీ క్రేజ్‌ను దక్కించుకుంది.
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఓ డ్యాన్స్ షోలో స్పెషల్ గెస్ట్ గా హాజరైన వరలక్ష్మి శరత్ కుమార్.. ఇందులో భాగంగా షాకింగ్ రహస్యాన్ని రివిల్ చేసుకుంది. ఈ డ్యాన్స్ షోలో ముగ్గురు పిల్లల తల్లి అయినా ఓ మహిళ తన అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. తర్వాత.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుని ఎమోషనల్ అయింది. ఇక ఆమెకు సర్ది చెప్పే క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తన లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేసింది.
ఎవరికి తెలియని ఓ అద్భుతమైన సంఘటనను పంచుకుంది. తను మాట్లాడుతూ నీతో నేను ఓ విషయం షేర్ చేసుకోవాలి.. సినిమాల్లోకి రాకముందు నేను మొట్టమొదటిసారి ఓ ప్రముఖ షో కోసం నడిరోడ్డుపై డ్యాన్స్ వేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. దానికి వాళ్లు నాకు రూ.2,500 ఇచ్చారని.. ఆ స్టేజి నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. కనుక ఎప్పుడు కూడా రోడ్‌పై డ్యాన్స్ చేయడం తప్పుగా ఎవరు భావించిన అవసరం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.