దివంగత అతిలోకసుందరి.. నటి శ్రీదేవి నట వారసులుగా కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి క్రేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే శ్రీదేవి చివరి సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్‌ను శ్రీదేవి భర్త అందించారు. ఐఫా వేడుకల్లో బోనికపూర్ దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నో గొప్ప సినిమాల్లో అలరించిన హీరోయిన్ శ్రీదేవి చివరిసారిగా తెరపై కనిపించిన సినిమా మామ్. ఇప్పటికీ చాలామంది ఆడియన్స్‌లో గుర్తుండిపోయి ఉంటుంది.
తాజాగా ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసినట్లు బోనీకపూర్ ఐఫా వేదికపై వెల్లడించారు. ఐఫా వేడుకలు తన భార్య శ్రీదేవిని గుర్తు చేసుకున్న ఆయన కూతుళ్లు జాన్వి, ఖుషి గురించి కూడా వివరించాడు. తన ఇద్దరు కూతుళ్లు తల్లి అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పుకొచ్చిన బోనీ.. మామ్స్ సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఖుషి ఇప్పటివరకు నటించని సినిమాలన్నింటినీ నేను చూసా. లవ్ యాపా ఆర్చీస్ సినిమాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
ఆమెతో త్వరలో సినిమా తీయబోతున్నా. అది మామ్ 2 కావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఖుషి తన తల్లిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందని.. ఇక శ్రీదేవి.. తాను నటించిన అన్ని భాషల్లో స్టార్ బ్యూటిగా ఎదిగింది. ఇప్పుడు జాన్వి, ఖుషిలు కూడా అలాంటి గుర్తింపు కోసమే ప్రయత్నిస్తున్నారంటూ వివరించాడు. ఇక మామ్ విషయానికి వస్తే.. రవి ఉద్యావర్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమా హింది, తెలుగులో రిలీజై రెండు చోట్ల మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో శ్రీదేవి నటనకు మరణానంతరం ఉత్తమ నటిగా అవార్డు దక్కింది.