టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు సినిమాల విషయంలో నెమ్మదించినా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో చిరు.. శ్రీ లీలకు సత్కారం చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు చిరంజీవి శ్రీలీలకు సన్మానం చేయడం ఏంటి.. అసలు ఏం జరిగిందని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
తాజాగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే, అదే రోజున చిరంజీవి తన సినిమా సెట్స్‌కు వచ్చిన హీరోయిన్ శ్రీలీలకు బహుమతిని అందజేశాడు. తనదైన స్టైల్ లో అతిధ్యం ఇచ్చిన చిరు.. ఓ అద్భుతమైన మెమొరబుల్ గిఫ్ట్ ను శ్రీలీలకు అందజేశాడు. శ్రీ లీల ఇదే విషయాన్ని సంతోషంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. చిరు నటిస్తున్న విశ్వంభర సినిమా షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న క్రమంలో.. అక్కడికి దగ్గరలోనే తాను హీరోయిన్గా నటిస్తున్న మరో సినిమా షూట్ జరుగుతుండడంతో.. తన ఫేవరెట్ హీరో చిరంజీవి పక్కనే ఉన్నారని తెలుసుకునీ శ్రీ లీల ఆయన కలిసి ఎందుకు అక్కడే సెట్స్ కు వెళ్ళిందట.
ఉమెన్స్ డే రోజున చిరంజీవి కోసం తను అక్కడకు వెళ్లడంతో.. చిరు ఆమెను గౌరవించి శాలువాతో సత్కరించడంతోపాటు.. దుర్గాదేవి రూపం ముద్రించి ఉన్న రేర్ బ్యూటిఫుల్ శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రత్యేకమైన ఆ బహుమతిని అందుకున్న శ్రీ లీల తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అంతేకాదు ఆ సెట్స్‌లో తాను రుచి చూసిన ఉప్మా, దోసెల విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఈ పోస్ట్‌ను పంచుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేసిన పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.