పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్‌లో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే.. బన్నీ నెక్స్ట్ మూవీపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మైథలాజికల్ మూవీలో నటించబోతున్నాడని.. ఈ ఉగాది నుంచే సినిమా ప్రారంభమవుతుందంటూ టాక్ నడిచింది. అయితే.. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ స్వయంగా ప్రెస్ మీట్‌లో దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఇప్పట్లో అవకాశాలు లేవని చెప్పేశారు. దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ తమిళ్ డైరెక్టర్ అట్లితో ప్రారంభించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే బన్నీ కోసం సినిమా స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసేసాడట అట్లీ. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది వో క్రేజీ మల్టీ స్టారర్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అసలు మేటర్ ఏంటంటే.. మొదట ఈ స్టోరీ కోసం సల్మాన్ ఖాన్, రజనీకాంత్ కాంబినేషన్ను ఫిక్స్ అయ్యాడట అట్లీ. అయితే అల్లు అర్జున్ ఇదే కథ నచ్చడంతో కావాలని పట్టుబట్టాడట. అంతేకాదు.. బన్నీ కూడా షూటింగ్ కి సిద్ధంగా ఉండడంతో అట్లు ఈ సినిమాను ఆయనతో చేసేందుకు రెడీ అయ్యాడని.. సల్మాన్ ఖాన్ కూడా దానికి ఒప్పుకొని అట్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. ఇప్పుడు అట్లీ తెరకెక్కించాలని అనుకున్న మల్టీస్టారర్‌లో సల్మాన్ కు బదులుగా బన్నీ నటిస్తుండగా.. రజనీకాంత్ కూడా అల్లు అర్జున్తో కలిసి మెరువనున్నాడని సమాచారం. ఇంకా మూవీలో రజిని.. అల్లు అర్జున్ కు తండ్రిగా కనిపించనున్నాడని ఆయన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది.
ఇక.. ఇదే సినిమాలో శివ కార్తికేయన్ కూడా కీలకపాత్రలో నటించనున్నాడని సమాచారం. తాజాగా.. అమరాన్‌తో రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి స్టార్ హీరోల లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన్న శివ కార్తికేయన్.. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో మరింత హైప్ నెలకొంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. నిజంగా వీరి ముగ్గురి కాంబోలో సినిమా వస్తే మాత్రం రూ.3000 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఇండియన్ సినిమా చేరుకుంటుందంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. ఈ ఉగాది లోపు సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు రివీల్ చేసే ఛాన్స్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ రవిచంద్రన్ వ్యవహరించనున్నాడట. షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభించి.. ఏడది చివరి కల్లా పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.