బాలీవుడ్ నటుడు ఆదర్శ్ గౌరవ్ దాదాపు బాలీవుడ్ తొమ్మిది సినిమాల వరకు నటించాడు. తాజాగా సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఆదర్శ్ తెలుగు వుండితెర హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్థమయ్యాడు. బాలీవుడ్‌లో వైట్ టైగర్ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆదర్శ్.. హాస్టల్ డేస్, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో మెరిసాడు. ఇక ప్రస్తుతం తెలుగు స్క్రీన్‌పై మెరవాలని కలలు కంటున్నాడు. కానీ.. అవకాశం దొరకక బాలీవుడ్‌లోనే నిలిచిపోయాడు. టాలీవుడ్‌లో కనిపించాలని నా కల.. అలాంటి సమయంలో నాకు సమంత సాయం చేసిందని.. ఆమె ఒత్తిడి వల్లే టాలీవుడ్‌లో అవకాశం దక్కించుకోగలిగాను అంటూ ఆదర్శ్ వివరించాడు.
నా మాతృ భాష తెలుగు అని.. తెలుగు సినిమాల్లో పనిచేయాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. కానీ.. ఎవరిని అప్రోచ్ కావాలి.. ఎలా అవకాశాలు తెచ్చుకోవాలి.. నాకేమీ తెలియదు. ఈ విషయంలో నేను సమంతకు ధన్యవాదాలు చెప్పాలి. సిటాడెల్ సిరీస్ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ సెలబ్రేట్ చేసుకున్న పార్టీకి నేను వెళ్ళా.. అప్పుడు నాకు తెలుగులో పనిచేయాలని ఉందని.. సమంతకు వివరించినా సరే.. అలా అయితే టాలీవుడ్‌లో జరిగే ఆడిషన్స్‌కు కచ్చితంగా వెళ్ళని గట్టిగా చెప్పిందని.. కావాలంటే కొన్ని మీటింగ్స్ కు నన్ను తీసుకెళ్లేందుకు సహాయం చేస్తానని వివరించిందని చెప్పుకొచ్చాడు. ఇక సమంత మేనేజర్ సహాయం వల్ల తెలుగులో ఎంతోమందిని కలిశానని.. పలువురితో చర్చలు కూడా జరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ డైరెక్టర్‌తో పరిచయం ఏర్పడిందని.. ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా రూపొందుతుందని నేను ఎక్కువగా అనురాగ కస్యప్, విక్రమ్ అదిత్య మోత్వానే, దివాకర్ బెనర్జీ, జోరియా ఆఫ్టర్ సినిమాలను చూశాను. అందులో వారు చూపించే పాత్రలు రియల్ లైఫ్‌లోను తారసపడినట్లే అనిపిస్తాయి. ఇక నా చిన్నతనం నుంచే ఫ్యామిలీలో ఓ కఠినమైన నిర్ణయం ఉండేది. అదేంటంటే బయట ఏ భాష మాట్లాడినా ఇంటికి వస్తే మాత్రం తెలుగే మాట్లాడాలని రూల్ ఉండేది. అప్పుడు నాకు అసలు ఆ రూల్ ఎందుకు పెట్టారు అని అర్థం కాలేదు. కానీ.. అది నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరూ లేకున్నా.. ఈ ఇండస్ట్రీకి నేను కొత్త.. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళే అవుతున్న.. ఏదో దగ్గర సంబంధం ఉన్న ఫీల్ వస్తుంది. నాకు ఎవరు తెలియకపోయినా భాష వల్ల అందరం ఒకటే అన్న అభిప్రాయం నాలో కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. తన తెలుగు సినిమా టైటిల్ డైరెక్టర్ ఎవరు ఇలాంటి వివరాలను మాత్రం సీక్రెట్ గానే ఉంచాడు ఆదర్శ్ గౌరవ్. ప్రస్తుతం ఆదర్శ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.