నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంబో మూవీ అంటే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. బాలయ్యను హీరోగా ఎలివేట్ చేయడంలో బోయపాటి తర్వాతే మరవరైనా అనేంతలో మార్క్ క్రియేట్ చేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక బాలయ్య కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే కచ్చితంగా అఖండకు ముందు.. అఖండ తర్వాత అనే చెప్పుకోవాలి. అఖండ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలయ్య ఇప్పటికీ ఫ్లాప్ అన్నది లేకుండా దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా.. బాలయ్య నుంచి చివరికి వచ్చిన డాకు మహారాజ్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.60 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి భారీ రిజల్ట్ అఏదుకుంది. దీంతో బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న అఖండ 2ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఏకంగా రూ.80 కోట్లకు హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.
కేవలం డిజిటల్ హక్కులకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిందంటే.. థియేట్రికల్ రైట్స్, ఆడియో హక్కులు అన్నిటికీ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్ల వరకు ఈజీగా బిజినెస్ జరుగుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే సీనియర్ హీరోలలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఏకైక హీరోగా బాలయ్య పేరుపై సెన్సేషనల్ రికార్డు క్రియేట్ అవుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే బాలయ్య జంటగా సంయుక్తమేనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పిన్నిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమా గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమైతే తప్ప.. మ్యాక్సిమం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని సమాచారం.