ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్గా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. చాలా కాలం క్రితమే ఫిక్సయిన ఈ మూవీ తాజాగా కార్యరూపం దాల్చింది. ఇన్నాళ్లకు నటి నటుల లుక్ టెస్టులు పూర్తిచేసి షూటింగ్ దశలోకి అడుగుపెట్టారు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లుక్స్.. ఎన్నో సందర్భాల్లో లీకే వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని లుక్‌లో మహేష్ కనిపించనున్నాడు. ఇక ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ కోసం ఒడిస్సా వెళ్లారు టీం. షెడ్యూల్లో పాల్గొనేందుకు మహేష్, పృధ్వీరాజ్ ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.
అయితే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించిన వీడియో ఒకటి హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. షూటింగ్ వీడియోలో మహేష్ రింగులో జుట్టుతో.. ఊర మాస్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఎవరూ లేని ఖాళీ ప్రదేశంలో మహేష్ ని సెక్యూరిటీ సిబ్బంది నెట్టుకుంటూ ముందుకు వస్తున్నట్లు.. తర్వాత వీల్ చైర్ లో కూర్చున్న పృథ్వీరాజ్ ముందు మహేష్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు చూపించారు. ఆ సీన్ చూస్తుంటే రాజమౌళి మార్క్.. ఊర మాస్ కమర్షియల్ టచ్ చూపించింది. ఫారెస్ట్ అడ్వెంచర్స్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి బ్రేక్ లేకుండా ఏడాదిలోపు షూటింగ్ పూర్తిచేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.
దానికి తగ్గట్లుగానే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశాడని.. ఈ సినిమా నుంచి చిన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. షూటింగ్ లొకేషన్‌లో మొబైల్ ఫోన్స్ కూడా నిషేధం విధించాడు జక్కన్న. అయినా ఈ వీడియోని ఎవరు రహస్యంగా లీక్ చేసారో.. ఎవరు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఈ వీడియోని లీక్ చేసిన వాళ్ళు దొరికితే మాత్రం.. జక్కన్న చట్టపరంగా స్ట్రాంగ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్‌కి సంబంధించిన షూటింగ్ వీడియోస్ ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్యలకు పాల్పడిన వారిపై రాజమౌళి కఠిన చర్యలు తీసుకున్నారు. మళ్ళీ అలాంటి టైం దగ్గరలోనే ఉందనిపిస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా గోప్యంగా మైంటైన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అనడంలో సందేహం లేదు.