తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ నచ్చితే ఆ సినిమా ఎంత చిన్న హీరోదైనా.. ఎంత చిన్న బడ్జెట్ మూవీ అయినా.. ఎన్ని అవాంతరాలు వచ్చినా.. సినిమాకు బ్రహ్మరథం పడతారు. అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా సంక్రాంతికి వస్తే దానికి మరింత ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. ప్రతి ఏడాది సంక్రాంతిలో ఓ సినిమా తన నుంచి వచ్చేలా పక్కా ప్లాన్ చేసుకుంటాడు. అలా ఈ ఏడది కూడా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దిల్ రాజు.
ఇలాంటి క్రమంలోనే వచ్చే ఏడాది కూడా తన నుంచి ఓ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. సెకండ్ హ్యాండ్ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూట్ ఏప్రిల్ లేదా మే నుంచి ప్రారంభం కానుంది. ఇక శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే టైటిల్ తో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ కాకున్నా.. కచ్చితంగా మరేదైనా ప్రాజెక్ట్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తాడు. మరపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.
ఆయన తెరకెక్కించే సినిమాలను చూసి కచ్చితంగా ఎంటర్టైన్ అవ్వచ్చు.. నవ్వుకోవచ్చునే ఉద్దేశంతో చాలామంది ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన వరస సక్సెస్ లు అందుకుంటున్నారు. అయితే చివరిగా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేలా ప్లాన్ చేసుకుంటున్నాడట అనిల్. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అనిల్ వర్సెస్ దిల్‌రాజు పోరు రసవతరంగా ఉండబోతుందని.. వచ్చే ఏడాది బరిలో అనిల్.. దిల్‌రాజుకు ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.