ఒకప్పటి మావోయిస్ట్‌ల అడ్డా.. ఇప్పుడు తెలుగు సినిమాలకు కంచుకోట అని తెలుసా..?

ఒడిశాలోని కోరాపూర్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల అడ్డగా నిలిచింది. 15 ఏళ్ళ‌ క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉండేవి. దీంతో.. దేశ ప్రజలు అంతా ఆ దేశం పై దృష్టిని సారించేవారు. కానీ.. ప్రస్తుతం అంత మారిపోయింది. ప్రకృతి అందాలతో వీక్షకులను అద్యంతం ఆకట్టుకుంటన ఈ ప్ర‌దేశం.. అందరిని కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే సినీ తారల ఆటపాటలతోనూ కలకలలాడిపోతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీ రావాలంటే ఆఫీసర్లు సైతం భయపడిన స్టేజ్ నుంచి.. తను ఎప్పుడెప్పుడు ఈ ప్రదేశానికి బదిలీ అవుతామా అని ఆసక్తిగా ఎదురు చూస్తే స్థాయికి ఎదిగింది.

లక్షలాదిమంది దేశ , విదేశాల నుంచి విహారయాత్ర కోసం ఈ ప్లేస్ కు వస్తున్నారట‌. ఇందులో భాగంగానే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కొద్ది రోజుల క్రితం ఓ సామాన్య వ్యక్తులాగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడి అందాలను తిలకించేందుకు వెళ్లడట. అలా కోరాపుట్ జిల్లా.. సిమిలిగడ్డ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో కొంత టైం స్టే చేశారు. ఇక్కడ అందాలను గురించి తాను మొత్తం గమనించిన జక్కన్న.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సినిమా షూటింగ్‌కు ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని ఇక్కడ కూడా కొన్ని అందమైన సన్నివేశాలు తీయవచ్చని ప్లాన్ చేశాడట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

సిమిలిగుడ్డ ప్రాంతంలోని హోటల్లో గదులు ఫుల్ బిజీ అయిపోయాయి. ఆంధ్ర సరిహద్దు సాలూరికి సమీపంలోనే దేవలమాలి పర్వతంపై SSMB 29 షూట్ జరుగుతోంది. అందువలన ప్రతిరోజు ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ‌ ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు ఇక్కడ జరుగుతున్న షూట్ సెలబ్రేషన్ చూడడానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి బృందం సినిమా నుంచి ఎలాంటి వీడియోలు బయటకు రాకుండా ఎంత స్టిక్ రూల్స్ పెట్టుకున్న.. లీకుల బెడ మాత్రం వదలడం లేదు. అలా తాజాగా వీల్ చైర్ మీద పృథ్వీరాజ్ ఉండగా మహేష్ బాబును సెక్యూరిటీ గార్డ్ తీసుకోవచ్చు మోకాళ్ళపై కూర్చోబెట్టిన వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో లీక్ చేసింది ఓ సాధారణ సందర్శకుడిగా వచ్చి కారులో కూర్చుని ఆ వీడియోని తీసి వాట్సప్ గ్రూపులో షేర్ చేసినట్లు సమాచారం.