లగ్జరీ కార్‌తో ఊర్వశి బిల్డప్ చూశారా.. కార్ విలువ తెలిస్తే మైండ్ బ్లాకే..!

కాస్ట్లీ కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ కేవలం స్టార్ స్టేటస్ కు సంబంధించింది మాత్రమే కాదు.. ఫైనాన్షియల్ గా సంపాదన స్థాయిని కూడా ఎలివేట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి రూ.100 కోట్ల హీరోలు.. రోల్స్ రాయల్స్ ని వాడడంలో అతిశ‌యోక్తి లేదు. కానీ.. ఐటెం సాంగ్స్, చిన్న పాత్రలో సరిపెట్టుకుంటున్న హాట్ బ్యూటీ ఊర్వసి రౌటేలా.. రోల్స్ రాయిస్ ని కొనుగోలు చేసి బిల్డప్పులు కొడుతూ అందరికి షాక్ కలిగించింది.

Urvashi Rautela flaunts her diamond jewellery when asked about Saif Ali  Khan's stabbing - The Tribune

ఇటీవల డాకు మహారాజ్ దబిడి దిబిడే సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులాట దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలయ్య సమక్షంలో బోల్డ్ మాస్ స్టెప్స్‌తో చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే దీనిపై పలు ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ వినిపించినా కూడా.. సాంగ్ మాత్రం హైలెట్ అయింది. అయితే ఊర్వ‌శి ట్రోల్స్ పై రియాక్ట్‌ అవుతూ.. ఎన్బికె మాస్ స్టేటస్ కు తగ్గట్టుగా.. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని శేఖర్ మాస్టర్ తో కలిసి ప్రతిదీ ప్లాన్డ్‌గా రూపొందించారని వివరణ ఇచ్చింది. కాగా.. ఈ సాంగ్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలోనే అమ్మడు కొన్న కాస్ట్లి రోల్స్ రాయిస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ దాని కాస్ట్ ఎంత చెప్పలేదు కదా అక్షరాలా రూ.12 కోట్లు.

Urvashi Rautela Once Again Spotted In Rolls Royce Cullinan: ஒரே ஒரு தமிழ்  படத்துலதான் நடிச்சிருக்காங்க! ஆனா எந்த நடிகை கிட்டயும் இல்லாத 10 கோடி ரூபா  காரை ...

అయితే ఓ సాధర‌న న‌టిగానే ఉంటూ.. ఐటెం సాంగ్స్ లో మెరుస్తున్న ఊర్వశి లాంటి ముద్దుగుమ్మ ఏకంగా రూ.12 కోట్ల రోల్స్ రాయిస్ కారు కొనడం అందరిని ఆశ్చర్యం పరుస్తుంది. అంతేకాదు.. ఇంత కాస్ట్ కొన్న మొట్టమొదటి నటిగా కూడా ఊర్వశీ రౌతెలా రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫోర్బ్స్‌.. రిచ్ లిస్టులో కూడా అమ్మ‌డు చేరడం విశేషం. ఇదంతా పక్కన పెడితే.. ఊర్వశికి సినిమాలతో ఇంత‌ డబ్బు ఎలా వస్తుంది అనే అంచనా వేస్తే.. సినిమాకు రూ.2 నుంచి రూ.3 కోట్ల చొప్పున లెక్కేసి.. ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేసుకున్న ఈజీగా రూ.8 కోట్లు వచ్చేస్తుందట. అంతేకాదు.. మరో పక్క సోషల్ మీడియాలను అమ్మడు మంచి స్పీడ్ గా దూసుకుపోతుంది. అక్కడ ఒక్కో పోస్టుకు లక్షల్లో ఆదాయాన్ని అర్జించుకుంటుంది. ర్యాంప్ వాక్‌లు, రిబ్బన్ కటింగ్ లు ఇలా ఇతర ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తుంది. ఈ క్రమంలోనే తనని తాను మరింతగా ఎలివేట్ చేసుకునేందుకు రోల్స్ రాయిస్ కొనుగోలు చేసి మరీ బిల్డప్ ఇస్తుందని అంత భావిస్తున్నారు.