ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్ అందుకున్న జక్కన్న.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమాలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సైన్స్ ప్రిక్షన్ డ్రామా గా రుపొందనుందని తాజాగా లీకైన వీడియోస్ తో క్లారిటీ వచ్చింది. అయితే సినిమాలో మహేష్‌ను డ్యూయల్ షేడ్స్‌లో చూపించనున్నాడట జక్కన్న. మహేష్ బాబు సినిమాలో ఎప్పుడు చూడని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
అంతేకాదు.. తాజాగా ఆయన నుంచి లీకైన వీడియోస్, ఫొటోస్ కూడా దానికి అర్థం పట్టినట్లుగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. ఎంత మాస్, వైల్డ్, యాక్షన్ సినిమాలను చాలా మంచి కంటెంట్ తో తెరకెక్కించే.. 100 ఏనుగులంత స్ట్రాంగ్ పర్సన్ అని వివరించే జక్కన ఓ సినిమాను చూసి ఎమోషనల్ అవ్వడం అనేది చాలా కష్టం. అది కూడా కంటతడి పెట్టేంతగా ఇన్వాల్వ్ అయిన ఓ సినిమా ఆయన లైఫ్ లో ఉందట. అప్పటివరకు ఎన్ని సినిమాలు చూసిన ఆయన ఒక్కసారి కూడా ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు.
కానీ.. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో.. సినిమా చూసిన తర్వాత ఆయన ఎంతగానో ఎమోషనల్ అయ్యాడని.. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ సినిమా చూసిన ప్రతిసారి తన తండ్రికి బాగా కనెక్ట్ అయిపోతాడని ఓ సందర్భంలో వివరించాడు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా.. ఈ సినిమా పట్ల ఎంతగానో ఎమోషనల్ అయినట్లు సమాచారం. అంతేకాదు.. సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమాను చూస్తున్నప్పుడు కచ్చితంగా ఎమోషనల్ అయి తీరుతారు. అలాఆయన కెరీర్‌లో సినిమాతో ఏడ్చిన ఏకైక మూవీ నాన్నకు ప్రేమతో అని తెలుస్తుంది. రాజమౌళి లాంటి ఒక దిగ్గజ దర్శకుడిని తన కంటెంట్ తో ఇన్వాల్వ్ చేసి ఏడిపించిన ఘనత సుకుమార్‌కే దక్కింది.