సూపర్ స్టార్ కృష్ణకు ఏకంగా ఇన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయా.. ఓ సంఘానికి చిరంజీవినే ప్రెసిడెంట్ కూడా..!

టాలీవుడ్ సీనియ‌ర్ సూపర్ స్టార్ ఘ‌ట్టమనేని కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరింగ్ అండ్ డాషింగ్‌ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మోస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి.. సరికొత్త ఒర‌వడిని నేర్పించాడు కృష్ణ. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి ఎన్నో జోనర్లలో రకరకాల సినిమాలను తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన కృష్ణ.. అప్పటి రాజకీయాల్లోనూ తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయుంగ్‌ దక్కించుకున్నాడు.

Mega Star president of Super Star fans association | cinejosh.com

ఇదిలా ఉంటే.. దాదాపు 5 ద‌శాబ్దాలపాటు టాలీవుడ్‌లో భిన్నమైన సినిమాల్లో నటించిన కృష్ణకు.. అప్పట్లో ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఉండేవని.. అందులో ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్ అంటూ ఓ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్లో చిరంజీవి వెల్లడించడం విశేషం. కృష్ణ స్పూర్తితోనే సినిమాల్లోకి తాను వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కృష్ణ అభిమాన సంఘాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. తమిళ, కర్నాటక లోనూ ఉండేవట‌. 1981లో తోడుదొంగలు సినిమా రిలీజ్ సమయంలో పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో.. అప్పట్లో కరపత్రం రిలీజ్ చేశారు.

I am a fan of Superstar Krishna - chiranjeevi - Forum

అయితే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చిరు పేరు కనబడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు.. కృష్ణతో కలిసి ఆ సినిమాలో చిరంజీవి కూడా నటించారు. ఇప్పుడు మరోసారి ఈ పేజ్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు జనరేషన్ నటీనటులతో కలిసి పని చేసిన అతితక్కువ మంది హీరోలలో కృష్ణ పేరు కచ్చితంగా ఉంటుంది. దాదాపు 340కి పైగా సినిమాలు నటించిన ఈయన.. ఒకే ఏడాది అత్యధిక సినిమాలు నటించిన‌ హీరోగాను రికార్డుకు సృష్టించాడు. ఇప్పటివరకు మరే హీరో.. ఆయన సృష్టించిన రికార్డును టచ్ చేయలేకపోయాడు. 1972 లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో నటించాడు.